Moviesబాలయ్య సినిమాల్లో జగతి ఆంటీ ..రోల్ ఏంటో ఏంటో తెలిస్తే ఫ్యూజులు...

బాలయ్య సినిమాల్లో జగతి ఆంటీ ..రోల్ ఏంటో ఏంటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

జగతి ఆంటీ అలియాస్ జ్యోతిరాయ్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఎంత బాగా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పబ్లిసిటీ అలాగే పాపులారిటీ దక్కించుకొని తనకంటూ స్పెషల్ స్థానాన్ని క్రియేట్ చేసుకుంది . కాగా ప్రెసెంట్ పలు సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా ముందుకెళ్తుంది. సీరియల్ లో ఆంటీ పాత్ర పోషించిన సినిమాల్లో సీరియల్స్ లో మాత్రం యంగ్ హీరోయిన్ గా కనిపించడానికి సిద్ధపడుతుంది.

కాగా ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో బడా బడా ఆఫర్స్ అందుకుంటుంది జ్యోతి రాయ్ అన్న వార్తలు మనం వింటున్నాం. ఎన్టీఆర్ 31 సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని కూడా ఆమె ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది . ఇప్పుడు అమ్మడుకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది .

ప్రజెంట్ సెట్స్ పై ఉన్న బాలయ్య బాబు సినిమాలో జ్యోతి రాయ్ ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతుందట . అఖండ 2 లో పూర్ణాది ఎంత మంచి క్యారెక్టరో.. అంత మంచి క్యారెక్టర్ బాబి ఈ సినిమాలో ఆమెకు ఇచ్చాడట . ఇప్పటివరకు ఆమెపై ఉన్న నెగటివ్ ప్రచారం మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా ఈ రోల్ ఉండబోతుందట . దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మొత్తంగా అమ్మడు మంచి ఛాన్సే పట్టేసింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news