Moviesఅసలు మాధురి దీక్షిత్ చేయాల్సిన ఆ క్రేజీ సినిమా..అమల చేతికి ఎలా...

అసలు మాధురి దీక్షిత్ చేయాల్సిన ఆ క్రేజీ సినిమా..అమల చేతికి ఎలా వచ్చిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. మాయాలోకం ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఇది జరుగుతుంది అని చెప్పలేం . ఇది జరుగుతుంది అని చెప్పేలోపే వేరేది జరుగుతుంది. అలా ఎన్నో ఎన్నో మనం ఇండస్ట్రీలో చూసాం . కాగా అలాంటి ఓ విషయం అమల లైఫ్ లో జరిగింది . ప్రెసెంట్ అదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో అమల ఒక క్రేజీ హీరోయిన్ . నాగార్జున ను పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండస్ట్రీకి దూరమైందే తప్పిస్తే .. ఇప్పుడు ఆమె సినిమాలోకి వచ్చిన సరే జనాలు కచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ..ఆదరిస్తారు .

కాగా గతంలో అమల నటించిన సినిమా పుష్పక విమానం . కమల్ హాసన్ హీరోగా సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ మూవీలో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. మాటలు లేకుండానే మూకీచిత్రంగా ఈ సినిమాలు తెరకెక్కించారు. జనాలను కూడా బాగా అట్రాక్ట్ చేసింది . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నటీనటుల ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారాయి .

ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు . 1987లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసేసింది . నిజానికి ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నీలం కొఠారిని తీసుకోవాలనుకున్నాడట డైరెక్టర్ . ఆపై ముంబైకి వెళ్లి ఆమెకు కథ కూడా వినిపించాడట . అయితే సినిమా ఓకే కానీ అంటూ కొన్ని కండిషన్స్ పెట్టిందట . దీంతో డైరెక్టర్ అన్ని కండీషన్స్ మేం భరించలేం అంటూ సెకండ్ ఆప్షన్ కింద మాధురి దీక్షిత్ ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది . అప్పటికే ఆమె సైన్ చేసిన సినిమాలు కూడా తెరకెక్కకుండా ఆగిపోయాయి. దీంతో భయపడిపోయిన డైరెక్టర్ ఆ తర్వాత ఈ రోల్ కోసం అమలను ఫైనల్ గా ఫిక్స్ చేసుకున్నారట . అలా మాధురి దీక్షిత్ చేయాల్సిన సూపర్ సూపర్ హిట్ సినిమా అమల తన ఖాతాలో వేసుకునేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news