Moviesఓరి దేవుడోయ్.. అల్లు అర్జున్ కి అది అంటే అంత పిచ్చా..?...

ఓరి దేవుడోయ్.. అల్లు అర్జున్ కి అది అంటే అంత పిచ్చా..? కారు టైర్స్‌ పై ఏం చేశారో చూడండి.. ఫొటోలు వైరల్..!!

అల్లు అర్జున్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఒకటి కాదు రెండు కాదు కోట్లల్లోనే ఈయనను ఆరాధించే జనాలు ఉంటారు. మరి ముఖ్యంగా బన్నీని ఒక హీరోగా కన్నా కూడా ఒక అన్నలా భావిస్తూ ఉంటారు . అల్లు అర్జున్ కూడా ఫాన్స్ తో ఎక్కువగా చిల్ అవుట్ అవుతూ ఉంటారు . ఫ్యాన్స్ ఇష్టపడే సినిమాలల్లోనే నటిస్తూ ఉంటాడు అల్లు అర్జున్ . ఆయన ఎక్కడికెళ్ళినా సరే తన స్టైల్ డిజైన్ చేయించుకుంటారు.

మరి ప్రతి విషయంలోనూ ఆ ప్రత్యేకత చూపించే బన్నీ తన కారు విషయంలో వదిలేస్తాడా..? నో ఛాన్స్.. బన్నీ అంటేనే స్టైలిష్ స్టార్.. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు . ఈ క్రమంలోనే తన కార్ టైర్స్ పై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకొని సెన్సేషనల్ రికార్డును సృష్టించాడు బన్నీ . అల్లు అర్జున్ స్టాంప్ మార్క్ ఆఆ సిగ్నేచర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే .

ఈ పేరుతోనే పలు సినిమాలు.. బిజినెస్ లు కూడా ఉన్నాయి . ఇప్పుడు ఈ లోగో మార్క్ ని కార్ టైర్స్ పై వచ్చేలా డిజైన్ చేయించుకున్నాడు మన అల్లు అర్జున్ . ప్రస్తుతం పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూట్ కి తన కారులో వచ్చారు. టైర్స్ పై ఉన్న ఏఏ లోగోని కొందరు అభిమానులు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో అల్లు అర్జున్ పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news