Moviesనందమూరి అభిమానులకు మండిస్తున్న అక్కినేని నాగచైతన్య .. టైగర్ నోట్లో తల...

నందమూరి అభిమానులకు మండిస్తున్న అక్కినేని నాగచైతన్య .. టైగర్ నోట్లో తల పెడుతున్నావ్ కదరా రేయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీలు అయినా అక్కినేని ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ఎంత క్లోజ్ గా ఉంటారో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. దానికి కారణం నాగచైతన్య తీసుకున్న నిర్ణయమే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో టఫ్ కాంపిటీషన్ ఎక్కువగా నెలకొంది. మరీ ముఖ్యంగా ఒక స్టార్ హీరో సినిమా ఏదైనా మంచి తేదీన రిలీజ్ చేస్తున్నారు అంటే .. అదే తేదీన మరో స్టార్ కూడా పోటీ పడడానికి సిద్ధపడుతున్నారు .

రీసెంట్గా సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నాయో తెలిసిందే. ఫైనల్లీ హనుమాన్ సూపర్ సక్సెస్ అయింది. కాగా అక్టోబర్ 10 వ తేదీ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు . కొన్ని కారణాల చేత ఏప్రిల్ 5 ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అదే తేదీన నాగచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న తండేల్ సినిమా కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట .

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం .. ఇదే డేట్ ను చందు మండేటి నాగచైతన్య కన్ఫామ్ చేసుకున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావాలని నాగచైతన్య ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటుంటే మరికొందరు మా ఎన్టీఆర్ తో నీకు పోటీయా..? టైగర్ నోట్లో తలపెడుతున్నవ్ చూసుకో జాగ్రత్త అంటూ హింట్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news