Moviesఆ డైరెక్ట‌ర్ ప్రేమ‌లో ప‌డి కెరీర్ నాశ‌నం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌..!

ఆ డైరెక్ట‌ర్ ప్రేమ‌లో ప‌డి కెరీర్ నాశ‌నం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌..!

సినీ రంగంలో ఎందరో స్టార్ హీరోయిన్లు డైరెక్ట‌ర్ల ప్రేమ‌లో ప‌డుతుంటారు… పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ఇందులో కొన్ని ప్రేమ‌లు పెళ్లిళ్ల వ‌ర‌కు వెళ్లి స‌క్సెస్ అవుతుంటాయి. కొన్ని ప్రేమ‌, పెళ్లిళ్లు త్వ‌ర‌గానే పెటాకులు అవుతుంటాయి. ఆర్కే సెల్వ‌మ‌ణి – రోజా ప్రేమ పెళ్లి రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా కొన‌సాగుతోంది. అలాగే రమ్య‌కృష్ణ కూడా ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీని ప్రేమ‌పెళ్లి చేసుకుని జీవితం కొన‌సాగిస్తోంది. న‌య‌న‌తార కూడా ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ను ప్రేమ వివాహ‌మే చేసుకుంది.

అయితే అచ్చ తెలుగు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ మాత్రం కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే ఓ ద‌ర్శ‌కుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ప్రేమ వివాహం ఆ హీరోయిన్ కెరీర్‌కు బ్రేక్ వేసి ప‌డేసింది. త‌ర్వాత వీరి వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులు వ‌చ్చి చివ‌ర‌కు వారు విడిపోయారు. ఆ హీరోయిన్, ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు సూర్య‌కిర‌ణ్‌, క‌ళ్యాణి.

సూర్య‌కిర‌ణ్ మ‌ళ‌యాళీ అన్న‌పూర్ణ బ్యాన‌ర్లో వ‌చ్చిన స‌త్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నంలోనే సూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌. ఈ సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌కు వ‌చ్చిన వ‌సూళ్లు 10 రెట్లు ఎక్కువ‌. ఆ త‌ర్వాత జెనీలియా తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. క‌ళ్యాణి అస‌లు పేరు కావేరి. ఆమె కూడా మ‌ళ‌యాళీనే. రాజ‌శేఖ‌ర్ శేషు సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీ కంట్లో ప‌డి ర‌వితేజ‌కు జోడీగా ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో నటించి హిట్ అందుకుంది.

ఆ తర్వాత దొంగోడు, కబడ్డీ కబడ్డీ, ధన 51 లాంటి సినిమాలు చేసింది. చాలా సెలక్టెడ్‌గా సినిమాలు చేసినా సంప్ర‌దాయ బ‌ద్ధ పాత్ర‌ల‌తో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. కెరీర్ ప‌రంగా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే సూర్య‌కిర‌ణ్‌తో ప్రేమ‌లో ప‌డ‌డంతో సినిమాల‌కు దూర‌మైంది. ఆ టైంలో క‌ళ్యాణి క్రేజ్‌తో పోలిస్తే సూర్య‌కిర‌ణ్ ఇమేజ్ చాలా త‌క్కువ‌. ఆ త‌ర్వాత సూర్య‌కిర‌ణ్‌కు వ‌రుస ప్లాపుల‌తో ఇండ‌స్ట్రీ ప‌ట్టించుకోలేదు.

ఇటు క‌ళ్యాణి సినిమాలు మానేసింది. ఆ త‌ర్వాత ఆర్థిక ఇబ్బందులు, మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో విడాకులు తీసుకున్నారు. ఏదేమైనా సూర్య‌కిర‌ణ్ ప్రేమ‌లో ప‌డ్డ క‌ళ్యాణి పెళ్లి చేసుకోకుండా కొంత కాలం హీరోయిన్‌గా కొన‌సాగి ఉంటే ఆమె టాలీవుడ్‌లో మ‌రికొన్ని మంచి సినిమాలు చేసి ఉండేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news