Moviesఒక్క సినిమాతోనే తేజ సజ్జకు అంత హెడ్ వెయిటా..? అలాంటి కండిషన్స్...

ఒక్క సినిమాతోనే తేజ సజ్జకు అంత హెడ్ వెయిటా..? అలాంటి కండిషన్స్ పెడుతున్నాడా..?

తేజ సజ్జా సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి క్రేజ్ దక్కించుకున్న తేజ .. రీసెంట్గా హనుమాన్ సినిమాలో నటించాడు . అంతకుముందు హీరోగా పలు సినిమాల్లో చేసిన రాని గుర్తింపు హనుమాన్ సినిమాతో వచ్చేసింది. ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరోగా మారిపోయి 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయారు. పెద్దపెద్ద బడా హీరో కొడుకులే 100 కోట్ల క్లబ్ లోకి చేరలేకపోయారు .

తేజ మాత్రం సునాయాసంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు . అయితే హనుమాన్ సినిమా వచ్చిన సక్సెస్ తో తేజా సజ్జ తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసాడట . అంతకుముందు సినిమాకి 50 లక్షలు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటూ ఉండగా ఇప్పుడు ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట . త్వరలోనే త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తేజ కమిట్ అయిన సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందట .

ఈ క్రమంలోనే ఆయన రెమ్యూనరేషన్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్క సినిమా హిట్ తోనే డబుల్ రెమ్యూనరేషన్ అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. ఎగిరెగిరి పడకు తేజ అంటూ మరికొందరు సజెస్ట్ చేస్తున్నారు. మొత్తంగా తేజ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటాడో ఈ తేజ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news