Moviesసైంధ‌వ్ రివ్యూ... వెంకీని కాపాడేదెవ‌రు

సైంధ‌వ్ రివ్యూ… వెంకీని కాపాడేదెవ‌రు

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన సైంధ‌వ్ సినిమా వెంకీ కెరీర్‌లో 75వ సినిమాగా తెర‌కెక్కింది. సంక్రాంతి కానుక‌గా శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో చూద్దాం.

క‌థ‌:
సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేష్) తన కూతురు గాయత్రి (సారా)తో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ప‌క్కింట్లో ఉండే మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్) పాపని చూసుకుంటుంది. గతంలో సైంధ‌వ్ చేసిన క్రైమ్ దెబ్బ‌కు అత‌డి పేరు వింటేనే భ‌య‌ప‌డిపోతుంటారు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు కూతురు కోసం అన్నీ వ‌దిలేసి బ‌తుకుతూ ఉంటాడు. పాప‌కు స్పైనల్ మాస్క్యూలర్ ఎంట్రోపీ అనే వ్యాధి సోకుతుంది. దానినుంచి పాప బ‌త‌కాలంటే రు. 17 కోట్ల విలువైన ఇంజ‌క్ష‌న్ కావాలి. ఆ డ‌బ్బు కోసం సైంధ‌వ్ చేసిన ప‌నేంటి ? పాప‌ను రక్షించుకున్నాడా ? ఈ క్ర‌మంలోనే వికాస్ మాలిక్‌ (నవాజుద్దీన్) తో వచ్చిన గొడవ ఏమిటి ?, డా. రేణు (రుహాని శర్మ ), జాస్మిన్‌ (ఆండ్రియా జెరెమియా) పాత్రల‌కు ఈ క‌థ‌కు లింక్ ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
సైంధవ్ కోనేరు అనే సైకో పాత్రలో వెంకటేష్ చాలా పవర్ ఫుల్‌గా న‌టించాడు. యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మెప్పించాడు. వెంక‌టేష్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్‌ల‌లో స్టైలీష్ లుక్‌తో ఆక‌ట్టుకున్నాడు. గెస్ట్ రోల్లో ఆర్య మెప్పించాడు. హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించింది. జాస్మిన్‌ పాత్రలో ఆండ్రియా జెరెమియా, డాక్ట‌ర్‌ రేణుగా రుహాని శర్మ నటన కూడా బాగుంది. జిషు సేన్‌గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ లతో పాటు మిగిలిన నటీనటులు జ‌స్ట్ ఓకే. ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను రాసుకున్న యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి.

సినిమాలో మెయిన్ లైన్‌, సైంధ‌వ్ పాత్ర‌, క‌థా నేప‌థ్యం బాగున్నా.. ఇత‌ర పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ‌, న‌టీన‌టుల ప‌నితీరు బాగున్నా క‌థ‌నం విష‌యంలో ద‌ర్శ‌కుడు నిరాశ ప‌రిచాడు. సెకండాఫ్‌లో ఎమోష‌న్ బాగున్నా కొన్ని చోట్ల మెలోడ్రామాలా ఉంటుంది. సినిమాలో ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. సైంధ‌వ్ పోరాటంలో ఎమోష‌న్ ఉన్నా… ట్రీట్‌మెంట్‌లో స‌రైన కాన్‌ఫ్లిక్స్ బిల్డ్ అవ్వ‌లేదు.

కీల‌క స‌న్నివేశాల్లో గ్రిప్పింగ్ నెరేష‌న్ మిస్ అయ్యింది. ఎమోష‌న‌ల్ సీన్లు కూడా రొటీన్‌గానే ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు కాల్పుల మోతే. విల‌న్‌- హీరో వార్ లీడ్ ఇంకా బ‌లంగా ఉండాలి. ఏదేమైన ద‌ర్శ‌కుడు శైలేష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను మలచలేకపోయారు. ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా పాత్ర‌లు వారి రేంజ్‌కు త‌గ్గ‌ట్టుగా లేవు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నిక‌ల్‌గా చూస్తే దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ బాగుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా ఉండాల్సింది. మణికందన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ జ‌స్ట్ ఓకే. నిర్మాత వెంకట్ బోయనపల్లి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
సైంధవ్ అంటూ విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన‌ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది. వెంకటేష్ గ్రేస్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్, స్లో నేరేషన్, బోరింగ్ సీన్లు సినిమాకు మైన‌స్‌. యాక్ష‌న్ సీన్లు మాత్రం బాగున్నాయి. వెంకీ ఫ్యాన్స్ మాత్రం ఓ లుక్కేయొచ్చు. పెద్ద అంచ‌నాల‌తో వెళితే న‌చ్చ‌దు.

ఫైన‌ల్ పంచ్ : సైంధ‌వ్‌ను కాపాడేదెవ‌రు..

సైంధ‌వ్ రేటింగ్‌: 2.25 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news