Moviesనా సామిరంగ 7 రోజుల వసూళ్లు... గుంటూరు కారంకు దిమ్మ‌తిరిగేలా..!

నా సామిరంగ 7 రోజుల వసూళ్లు… గుంటూరు కారంకు దిమ్మ‌తిరిగేలా..!

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన సినిమా నా సామిరంగ‌, అల్ల‌రి న‌రేష్‌, రాజ్ త‌రుణ్ ముఖ్య‌పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు విజ‌య్ బిన్నీ తెర‌కెక్కించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్ట‌న‌ర్‌గా ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. అటు వైపు మ‌హేష్‌బాబు గుంటూరు కారం, వెంక‌టేష్ సైంధ‌వ్‌, హ‌నుమాన్ లాంటి సినిమాల పోటీలో రిలీజ్ అయినా కూడా నా సామిరంగ సినిమా స‌క్సెస్ అయ్యింది.

సంక్రాంతి పోరులో హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌గా.. వెంకీ సైంధ‌వ్‌, మ‌హేష్ గుంటూరు కారం సినిమాలు ప్లాప్ దిశ‌గా వెళుతున్నాయి. అయితే నా సామిరంగ సినిమా మాత్రం నాగ్ రేంజ్‌కు త‌గ్గ‌ట్టుగా బిజినెస్ చేసుకుని సంక్రాంతి రేసులో మ‌రో హిట్ సినిమాగా దూసుకు వెళుతోంది. ఈ సినిమా ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ దాటేసింది.

వారం రోజులు ముగిసే స‌రికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 20.54 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు 41.3 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. ఇక 7వ రోజు 1.11 కోట్లు షేర్ రాబ‌ట్టింది. ఏదేమైనా భారీ రేట్ల‌కు అమ్మిన మ‌హేష్ గుంటూరు కారంతో పోలిస్తే త‌క్కువ రేట్ల‌కు అమ్మినా నా సామిరంగ ఇప్ప‌టికే లాభాల్లోకి వ‌చ్చేసి సంక్రాంతి రేసులో రెండో క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది.

నా సామిరంగా వారం రోజుల ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 21 లక్షలు
సీడెడ్ – 20 లక్షలు
వైజాగ్ -23 లక్షలు
తూర్పు – 16 లక్షలు
వెస్ట్ – 9 లక్షలు
కృష్ణ – 8 లక్షలు
గుంటూరు – 9 లక్షలు
నెల్లూరు – 5 లక్షలు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news