Moviesహనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్: తేజ మార్కెట్ కి ఇది చాలా...

హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్: తేజ మార్కెట్ కి ఇది చాలా ఎక్కువే.. అంతా శ్రీరాముడి దయ..మొత్తం ఎన్ని కోట్లంటే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తేజ నటించిన సినిమా హనుమాన్ . నిన్న థియేటర్స్ లో సంక్రాంత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది . తేజ నటన ..ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వరలక్ష్మి శరత్ కుమార్ నటన సినిమాకి మరింత పాజిటివ్గా మారింది. మరీ ముఖ్యంగా తెరపై శ్రీరాముడి ఆంజనేయుడి బంధం గురించి ప్రశాంత్ వర్మ చెప్పిన విధానం అభిమానులను బాగా మెస్మరైజ్ చేసింది.

ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకునింది . ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ 12 కోట్లు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి సినిమా టాక్ కి ఇది చాలా చాలా తక్కువ . కానీ టికెట్లు రేట్లు హనుమాన్ సినిమాకి పెంచకపోవడం ..పైగా థియేటర్స్ తక్కువ కేటాయించడం .. అదేవిధంగా సినిమాపై ఫస్ట్ ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం ఫస్ట్ డే సినిమా కలెక్షన్స్ పడిపోవడానికి కారణం అంటున్నారు జనాలు .

కచ్చితంగా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ టీం. తేజానటన, ప్రశాంత్ వర్మ డైరెక్షన్, విజువల్స్, కథ, క్లైమాక్స్, ఇంటర్వెల్ అదిరిపోయేలా ఉన్నాయంటూ ఆడియెన్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. హై రేటింగ్ నూ దక్కించుకుంటోంది. బుక్ మై షో ఏకంగా 9.7 రేటింగ్ ను ఇచ్చింది. సంక్రాంతి సినిమాల సందడిలో ‘హనుమాన్’ అదరగొడుతోంది. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పోటీగా ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాబు స్థాయికి తట్టుకొని నిలబడేలా కనిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news