Moviesగుంటూరు కారం ట్వీట్టర్ రివ్యూ: మాహేశ్ బాబు ఫ్యాన్స్ కి మాస్...

గుంటూరు కారం ట్వీట్టర్ రివ్యూ: మాహేశ్ బాబు ఫ్యాన్స్ కి మాస్ జాతర.. ఇదేం ఊర నాటు రా బాబోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు .. తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తన ఖాతాలో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా వేసుకున్నాడు . సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రివిక్రమ్ మార్క్ ప్రత్యేకంగా కనిపించింది .

మాటలు అయితే తూటాలులా పేలాయి. ఎక్కడ ఏ విషయంలోనూ నెగ్లెట్ చేయకుండా త్రివిక్రమ్ మహేష్ బాబు అభిమానులను బాగా సాటిస్ఫై చేశారు . మరి ముఖ్యంగా మహేష్ బాబు ముందు సినిమాలకి ఈ సినిమాలకి బిగ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ సినిమాల విషయంలో మహేష్ బాబు రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు . ఈ సినిమాలో మాత్రం ఊర నాటు మాస్ డైలాగ్లతో మహేష్ అభిమానులకు బాగా కిక్ ఎక్కించాడు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా అందరూ గుంటూరు కారం కి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేయాల్సినటువంటి మూవీ ఇది అంటూ సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..? మొత్తానికి సినిమా రిలీజ్ కి ముందు ఎన్ని అవాంతరాలు ఎదురుకున్న సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం మంచి హిట్ నే వేసుకున్నాడు మన మహేశ్ బాబు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news