Movies"అర్ధరాత్రి 12 .. ఆ టైం ఫుల్ గా ఎంజాయ్ చేశా".....

“అర్ధరాత్రి 12 .. ఆ టైం ఫుల్ గా ఎంజాయ్ చేశా”.. ఇంద్రజ పోస్ట్ వైరల్..!

ఇంద్రజ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యమలీల – పెద్దన్నయ్య -చిన్ని చిన్ని ఆశ- సొగసు చూడతరమా వంటి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి నటనను కనబరిచింది . ఇప్పుడు సీనియర్ పాత్రలు పోషిస్తూ తన వయసుకు తగ్గ పాత్రలను చూస్ చేసుకుంటుంది .

ఇండస్ట్రీలో ఎవరితోనూ రూడ్ గా మాట్లాడి.. ప్రవర్తించని ఇంద్రజ దాదాపు 80 సినిమాలకు పైగా నటించింది. ఇంద్రజ ప్రస్తుతం పలుషోస్ కి జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. రీసెంట్గా ఇంద్రజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది . తన భర్త తన కుమార్తెతో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు పంచుకుంది . అలాగే హాలిడే మోడ్ ఆన్ అయింది అంటూ వాయిస్ తో ఓ వీడియోని కూడా స్టేటస్ లో పోస్ట్ చేసింది .

“అసలు నిజానికి మా హస్బెండ్ ఇలాంటివి అలౌ చేయరు. కానీ ఈ రోజు మేము బయటకు వచ్చాము ..మాతో ఎంజాయ్ చేస్తున్నారు.. చెన్నైలోని కత్తిపరరీ దగ్గర ఫుడ్ స్ట్రీట్ కొత్తగా ప్రారంభించారు .అర్ధరాత్రి 12 గంటలు దాటుతుంది.. మేము ఈ టైం లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం” అంటూ ఇంద్రజ ఎంతో ఎక్సైట్ అవుతూ చెప్పుకు వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news