Moviesమెగాస్టార్ మ‌న‌సు దోచిన ఆ వైసీపీ ఎంపీ ఎవ‌రో తెలుసా...!

మెగాస్టార్ మ‌న‌సు దోచిన ఆ వైసీపీ ఎంపీ ఎవ‌రో తెలుసా…!

సినిమా రంగంలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎంపిక కావడంతో పాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గత కొంతకాలంగా తిరిగి సినిమాల్లో బిజీ అవుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి ఓ వైసిపి ఎంపీపై ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖలోని రుషికొండలో ఎన్టీఆర్ వర్ధంతి – ఏఎన్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ ప్రజాసేవ తప్ప.. సంపాదనపై ధ్యాస లేని ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు కనిపించారని ప్రశంసల వర్షం కురిపించారు. విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు అయిన శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికలలో వైసీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఘనవిజయం సాధించి లోక్‌స‌భలో అడుగు పెట్టారు. ఐదేళ్ల కాలంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా గుంటూరు జిల్లాలో ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మనసు దోచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్నార్లకు సినిమాలపరంగా నిజమైన వారసుడు మెగాస్టార్ చిరంజీవి అని ప్రశంసించారు. చిరంజీవి నటనతో తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని.. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయకూడదని లావు కృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా చిరంజీవి వైసీపీ ఎంపీ లావుపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news