శ్రీదేవి .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అతిలోకసుందరిగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ చాలా చిన్న ఏజ్ లోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది . జాన్వికపూర్ దుబాయ్ హోటల్లో బాత్ టబ్ లో అనుమానస్పద స్థితిలో పడి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే . ఆ తర్వాత ఆమె వారసత్వాన్ని ఆమె కూతురు జాన్వి కపూర్ కంటిన్యూ చేస్తుంది .
దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోని జాన్వికపూర్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అమ్మ తనని ఏమని తిట్టేదో తెలుసుకొని ఎమోషనల్ అయింది .ఓ వీడియో జాన్వి కపూర్ కి సంబంధించి బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో..” మా మమ్మీ రూమ్ లోకి నేను వెళ్లి లిప్ స్టిక్స్ దొంగతనం చేసేదాన్ని .. అప్పుడు నా జేబులో దాచుకునే దాని.. అయితే మా మమ్మీ కనిపెట్టేసి నా దగ్గరికి వచ్చి ..
పాకెట్స్ చూపించమనేది.. నేను చూపించను పో అంటూ చెప్పేదాన్ని .. అయితే ఆమె బలవంతంగా నా పాకెట్స్ చెక్ చేసి అందులో లిప్ స్టిక్స్ కనపడితే “నా కొడకా..” అంటూ తెలుగులో నన్ను బాగా తిట్టేవారు.. ఆ విషయం ఇప్పుడు గుర్తొస్తుంటే ఏడుపొస్తుంది ” అంటూ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది జాన్వి కపూర్”. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!
Naa Kodaka… 😁 pic.twitter.com/dReIBc6Urw
— Imho (@Artoo_Detwo) January 3, 2024