Movies"దేవర" గ్లింప్స్ ను జనవరి 8నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..?...

“దేవర” గ్లింప్స్ ను జనవరి 8నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..? దాని వెనక దాగున్న సీక్రేట్ ఇదే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. పైగా ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం ఒక సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతూ ఉండడంతో సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు . ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి .

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా షూటింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నాడు కొరటాల శివ . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నాడు . న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ గ్లింప్స్ తేదీని కూడా ప్రకటించేసాడు కొరటాల శివ . జనవరి 8వ తేదీ దేవర సినిమా రిలీజ్ చేయబోతున్నాం అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు .

దానితో పాటు ఓ కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఓడలో సముద్రపు మధ్యలో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ని సరికొత్త లుక్ లో మనం చూడొచ్చు . ఆ వెనక పదుల సంఖ్యలో యాచ్ కూడా ఎన్టీఆర్ను ఫాలో అవుతూ ఉంటాయి . అయితే కొరటాల శివ ఎందుకు జనవరి 8న ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేయాలి అనుకున్నాడు ..? జనవరి ఒకటి కూడా రిలీజ్ చేయొచ్చుగా అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ ..శివ భక్తుడు .. పూర్తిగా శివుడిని నమ్ముతాడు .. అందుకే ఆయన జనవరి 8 సోమవారం ఈ స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news