Newsబాల‌య్య వార‌సుడి కోసం రంగంలోకి త్రివిక్ర‌మ్‌.... ద‌ర్శ‌కుడిగా కాదు...!

బాల‌య్య వార‌సుడి కోసం రంగంలోకి త్రివిక్ర‌మ్‌…. ద‌ర్శ‌కుడిగా కాదు…!

మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా గత నెల రోజులుగా గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. ఒకవైపు ఈ సినిమా అప్డేట్ లతోపాటు మరోవైపు రెగ్యులర్ షెడ్యూల్ తో త్రివిక్రమ్ చాలా బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉంటాడు.

ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ నుంచి ఇప్పుడు ఒక మ్యాటర్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమా కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ – బాలకృష్ణ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. బాబి – బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అదే సంస్థతో పాటు త్రివిక్రమ్ సొంత బ్యానర్ ఫార్చూన్‌ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమాకు భాగస్వామిగా ఉంది.

ఈ క్రమంలోనే బాలయ్య – త్రివిక్రమ్ మధ్య అన్‌స్టాప‌బుల్ షో నుంచి మంచి స్నేహం ఏర్పడింది. త్రివిక్రమ్ కూడా బాలయ్యతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక మోక్ష‌జ్ఞ మొద‌టి సినిమా కోసం ఎన్ని క‌థ‌లు వింటున్నా సెట్ కావ‌డం లేదు. బాల‌య్య కూడా ఇప్ప‌టికే చాలా క‌థ‌లు విన్నాడు. అయితే త్రివిక్ర‌మ్ మోక్ష‌జ్ఞ తొలి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ లేక‌పోయినా కూడా క‌థ వినే విష‌యంలోనూ. మార్పులు చేర్పుల విష‌యంలో హెల్ఫ్ చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మోక్ష‌జ్ఞ కోసం త్రివిక్ర‌మ్ మంచి స్టోరీ సెట్ చేసే విష‌యంలో తెర‌వెన‌క త‌న వంతు పాత్ర పోషిస్తాడ‌ని స‌మాచారం.

ఈ విష‌యంలో బాల‌య్య కూడా త్రివిక్ర‌మ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇక మంచి క‌థ రెడీ అయ్యేవ‌ర‌కు మోక్ష‌జ్ఞ తొలి సినిమా విష‌యంలో ఎలాంటి ఎనౌన్స్‌మెంట్లు లేకుండా.. మ‌రీ హైప్ లేకుండా చూడాల‌నుకుంటున్నారు. అలాగే మోక్ష‌జ్ఞ తొలి సినిమా ద‌ర్శ‌కుడిగా ఎవ‌రు సెట్ అవుతార‌న్న‌ది కూడా ప్ర‌స్తుతానికి పెద్ద స‌స్పెన్స్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news