Moviesఅక్కినేని ఫ్యామిలీకి తెలియకుండా..గుట్టు చప్పుడు కాకుండా..100 కోట్లు అలా తగలేసిన ఏఎన్ఆర్..!

అక్కినేని ఫ్యామిలీకి తెలియకుండా..గుట్టు చప్పుడు కాకుండా..100 కోట్లు అలా తగలేసిన ఏఎన్ఆర్..!

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే అక్కినేని అనే పేరు కనబడితే ట్రోల్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు అక్కినేని అన్న పేరు వినపడగానే పైకి లేచి నిల్చోని చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. అంతటి స్థానాన్ని అందుకున్నారు అక్కినేనిని నాగేశ్వరరావు గారు . కాగా సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి ఎన్టీఆర్ ఒక కారణమైతే ఏఎన్ఆర్ మరొక కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అలాంటి ఏఎన్నార్ ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి 100 కోట్ల ఆస్తిని సునాయాసంగా ఓ హీరో పేరుపై రాయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు సుమంత్ . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరియర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలో నటించాడు ..ఆ తర్వాత ఏజ్ కి తగ్గ పాత్రలు చూస్ చేసుకోలేకపోయాడు .

ఈ క్రమంలోనే ఫేడ్ అవుట్ అయిపోయాడు. కెరియర్ పరంగానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశారు . దీంతో కొన్నాళ్లపాటు పూర్తిగా డిప్రెషన్ కి గురైపోయారట సుమంత్. ఆ టైంలోనే ఫ్యూచర్లో నా మనవడి భవిష్యత్తు ఎలా ఉంటుందో..?? అని భయపడిపోయి ఏఎన్నార్ ఏకంగా 100 కోట్ల ఆస్తిని ఆయన పేరుపై రాసేసారట. ఈ విషయం ఆలస్యంగా అక్కినేని కుటుంబ సభ్యులకు తెలిసి ఆయనతో గొడవ పెట్టుకోవాలని చూశారట. కానీ నాగేశ్వరరావు మాత్రం ఆ 100 కోట్ల ఆస్తిని ఆయన పేరు మీదే అలాగే ఉంచేసారట. ఇదే విషయాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news