Moviesస‌మీరారెడ్డి కంటే ఎన్టీఆర్‌తో ల‌వ్‌లో ప‌డిన ఫ‌స్ట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా...!

స‌మీరారెడ్డి కంటే ఎన్టీఆర్‌తో ల‌వ్‌లో ప‌డిన ఫ‌స్ట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ తన కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ రవీనా రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఎన్టీఆర్ రెండో సినిమాలో గజాల హీరోయిన్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ తోను నటించాడు.

మధ్యలో ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లతో నటించాడు. అయితే సమీరా రెడ్డి.. ఎన్టీఆర్ మధ్య ప్రేమ బంధం చిగురించిందన్న పుకార్లు అయితే గట్టిగా వినిపించాయి. ముందుగా వీరిద్దరూ కలిసి నరసింహుడు సినిమాలో నటించారు. ఆ తర్వాత అశోక్ సినిమాలోను జోడిగా నటించారు. అశోక్ సినిమాలో ఎన్టీఆర్ పట్టుబట్టి సమీరా రెడ్డికి హీరోయిన్‌గా అవకాశం ఇప్పించారన్న ప్రచారం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.

సమీరా రెడ్డి విషయాన్ని వదిలేస్తే.. మరే హీరోయిన్ విషయంలోనూ ఎన్టీఆర్ ప్రేమ రూమర్లు ఎదుర్కోలేదు. అయితే సమీరా రెడ్డి – ఎన్టీఆర్‌ను ప్రేమించిందని అంటారు. సమీరారెడ్డి కంటే ముందే ఎన్టీఆర్‌తో జోడి కట్టిన మరో హీరోయిన్ ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడిందన్న ప్రచారం 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. స్టూడెంట్ నెంబర్ 1 తో హీరోయిన్ గా పరిచయం అయిన గజాల. వీరిద్దరి కాంబినేషన్‌లో స్టూడెంట్ నెంబర్ 1, అల్లరి రాముడు రెండు సినిమాల వచ్చి రెండు సూపర్ హిట్ అయ్యాయి.

అప్పట్లో ఎన్టీఆర్, గజాల కాంబినేషన్ వెండితెరపై అదిరిపోయింది. గజాలకు.. ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని ఎన్టీఆర్ పై మనసు పారేసుకుందని అప్పట్లో తెలుగు సినీ పత్రికలు పుకార్లు గట్టిగా ప్రచారం చేశాయి. అల్లరి రాముడు సినిమా తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి వెండితెరపై కనిపించలేదు. అలా వీరిద్దరి ప్రేమ పుకార్లకు చెక్ పడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news