Newsబాప్ రే.. మన శ్రీలీల కి ఇన్ని గేమ్‌స్ వచ్చా..? స్టేట్...

బాప్ రే.. మన శ్రీలీల కి ఇన్ని గేమ్‌స్ వచ్చా..? స్టేట్ లెవెల్ లో ఇన్ని గేమ్స్ ఆడిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల అందంగా ఉంటుంది . బాగా చదువుతుంది. ఇంతవరకే తెలుసు జనాలకి . అయితే ఆమెలో ఎవరికీ తెలియని కొత్త టాలెంట్ కూడా ఉంది . అదే ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . శ్రీ లీలా 24/7 అసలు టైం గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూటింగ్స్.. మరొక పక్క చదువు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఆమె నటించిన భగవంత్ కేసరి , ఆదికేశవ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి.

మరి కొద్ది రోజుల్లోనే ఆమె నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా రిలీజ్ కాబోతుంది . ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీలకు సంబంధించిన టాప్ విషయం బయటపడింది. ఈ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ ..”నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను ..నేను హీరో అని… డాన్స్ వచ్చు అని చాలా మందికి తెలుసు”.

“శ్రీలీల కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది.. డాన్స్ చేస్తుంది అని తెలుసు ..డాక్టర్ చదువుతుంది అని కూడా తెలుసు. అయితే ఆమె యాక్టింగ్ – డ్యాన్స్- డాక్టర్ మాత్రమే కాదు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది అని చాలా తక్కువ మందికే తెలుసు. హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది .. తనకు కూచిపూడి , భరతనాట్యం కూడా వచ్చు.. ఇంకా వీణ కూడా వాయిస్తుంది ఇలా ఆమెలో ఎన్నో టాలెంట్ దాగున్నాయి ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు అంటుంది. అలా నితిన్, శ్రీలీలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news