News11 భాషల్లో అవలీలగా మాట్లాడే సిల్క్ స్మిత .. ఏం చదువుకుందో...

11 భాషల్లో అవలీలగా మాట్లాడే సిల్క్ స్మిత .. ఏం చదువుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !!

సిల్క్ స్మిత .. ఈ పేరు చెప్తే ఇప్పుడు జనరేషన్ కి పెద్దగా ఫీలింగ్ ఉండదేమో.. ఆమె పేరు కూడా చాలా మందికి తెలిసి ఉండదు . అయితే మీ ఇంట్లోని తాతలకు అమ్మమ్మలకు నానమ్మలకు చెప్తే ఈ పేరు వెనుక ఉన్న ఇంపార్టెన్స్ క్లియర్ గా చెప్తారు .సిల్క్ స్మిత ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఆమె నటన . ఆమె డాన్స్ చేసిన సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ దక్కించుకుంటున్నాయి అంటే కారణం సిల్క్ స్మిత గ్రేస్ అనే చెప్పాలి .

నిజానికి ఆమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఇండస్ట్రీలోకి వచ్చాక సిల్క్ స్మితగా మార్చుకుంది. డిసెంబర్ 2 – 1960లో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించింది . సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ సెక్సీ పాత్రలతో అగ్రస్థానంలో నిలిచి ఇండస్ట్రీని షేక్ చేసిన సిల్క్ స్మిత.. తెలుగు – తమిళం – మలయాళం – కన్నడ – హిందీ భాషలలో సుమారు 475 కు పైగా సినిమాలు నటించింది .

అయితే ఈమె అన్ని లాంగ్వేజెస్ అవలీలగా మాట్లాడగలదు. అయితే ఈమె ఏమి చదువుకుంది అంటే మాత్రం నాలుగవ తరగతి అంటూ తెలుస్తుంది . 17 సంవత్సరాల వయసులోనే సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈమె స్టార్ డం కోసం చాలా చాలా కష్టపడింది . కొందరి ఈమెను కేవలం అందం కోసమే వాడుకున్నారు . అయితే సిల్క్ స్మిత మాత్రం తాను సంపాదించిన దానితో సగానికి పైగాని పేద ప్రజలకు ఖర్చు చేసేదట. చాలా చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని మరణించింది సిల్క్ స్మిత..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news