Moviesనైజాంలో ' స‌లార్ ' ఊచ‌కోత‌... 4 రోజుల్లో సెన్షేష‌న‌ల్ మ్యాజిక్‌...!

నైజాంలో ‘ స‌లార్ ‘ ఊచ‌కోత‌… 4 రోజుల్లో సెన్షేష‌న‌ల్ మ్యాజిక్‌…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ విధ్వంసం థియేటర్లలో కొనసాగుతోంది. ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన స‌లార్ సోమ‌వారంతో నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. కేవ‌లం మూడు రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 400 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా త్వ‌ర‌లోనే రు. 500 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోనుంది.

లాంగ్ ర‌న్‌లో త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2 రికార్డులు సైతం బ్రేక్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ఇక స‌లార్ నైజాంలో సెన్షేష‌న్ క్రియేట్ చేస్తోంది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే ఏకంగా రు. 50 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఇది రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు అస‌లు సిస‌లైన కం బ్యాక్ అని చెప్పాలి. ఇక ఈ భారీ యాక్ష‌న్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

క‌న్న‌డ రాకింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మించ‌గా ర‌వి బ్ర‌సూర్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news