Movies' స‌లార్ ' ఊచ‌కోత ఎఫెక్ట్‌... బ‌న్నీ టాప్ రికార్డ్ గ‌ల్లంతు...!

‘ స‌లార్ ‘ ఊచ‌కోత ఎఫెక్ట్‌… బ‌న్నీ టాప్ రికార్డ్ గ‌ల్లంతు…!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ సినిమా ఈనెల 22న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి విశేష అభిమానం సాధించింది. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతున్న సలార్.. ఓవర్సీస్ లో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఏడు మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం జరిగింది. త్వరలో సలార్ అక్కడ 10 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే దెబ్బతో పలుచోట్ల పాత రికార్డులకు పాత‌రేస్తున్నాడు రెబ‌ల్ స్టార్‌. ఈ క్రమంలోనే నైజాంలో హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాల జాబితాలో సలార్.. బన్నీ కెరీర్ బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురం కలెక్షన్లు క్రాస్ చేసి టాప్ – 3 ప్లేస్ లో నిలిచింది. సలార్ మూడో రోజుల్లోనే రూ.44 కోట్లు వసూళ్లు నైజంలో సాధించింది. నాలుగు రోజులకు రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించి.. నాన్ రాజమౌళి రికార్డును క్రియేట్ చేసింది.

ఇప్పటివరకు నైజాంలో RRR రూ.111.85 కోట్ల షేర్ తో మొదటి స్థానంలో ఉండగా.. బాహుబలి 2 రు. 68 కోట్ల షేర్ అందుకొని రెండో ప్లేస్‌లో ఉంటే… ఆ తర్వాత మరే సినిమా నైజాం ఏరియాలో రూ.50 కోట్ల మార్క్ అందుకోలేదు. అయితే సలార్ కేవలం నాలుగు రోజులకే రూ.50 కోట్ల షేర్ రాబట్టి అల వైకుంఠపురంలో సినిమాను నాలుగో స్థానానికి నెట్టేసింది. ఏది ఏమైనా సలార్ లాంగ్‌ర‌న్‌లో నైజాంలో ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news