Moviesప్రభాస్ చేసిన పనికి తెగ బాధపడిపోతున్న రెబల్ అభిమానులు..ఏంటి డార్లింగ్ ఇది..!!

ప్రభాస్ చేసిన పనికి తెగ బాధపడిపోతున్న రెబల్ అభిమానులు..ఏంటి డార్లింగ్ ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా “సలార్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమార్ మరో కీలక పాత్రలో కనిపించారు. జగపతిబాబు కూడా ఈ సినిమాలో మంచి రోల్ లో నటించారు . ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది . మరీ ముఖ్యంగా ప్రభాస్ నటన కెవ్వు కేక అని చెప్పాల్సిందే .

ఈ మూవీ ఖాన్సర్ అనే ఓ అండర్ వరల్డ్ క్రైమ్ సిటీ సింహాసనం కోసం జరిగే యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా అద్భుతంగా నటించడమే కాకుండా తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టాడు . ఈ సినిమా 500 కోట్ల మార్కును క్రాస్ చేసేసింది. ఇండియా ఓవర్ ఓవర్సీస్ లో ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ కలెక్షన్స్ జోరు చూస్తుంటే మరి కొద్ది రోజుల్లోనే 1000 కోట్లు క్రాస్ చేసేస్తుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు .

అయితే ఇంత బిగ్ హిట్ అయినా సలార్ సినిమా సెలబ్రేషన్స్ చాలా సీక్రెట్ గా జరగడం అభిమానులకి అస్సలు నచ్చలేదు . నిజానికి సలార్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు .. ఆ మాటకొస్తే ఏ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ చేయలేదు . దానికి కారణం వాళ్లకే తెలియాలి . కనీసం సినిమా సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేయకపోవడం అభిమానులను హార్ట్ చేస్తుంది. అయితే సినిమా హిట్ అయిన తర్వాత సినిమా నటీనటులు ఒక్క దగ్గర చేరి సక్సెస్ సెలబ్రేషన్స్ ను చాలా సింపుల్గా ఫినిష్ చేశారని.. ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గానే ప్రశాంత్ నీల్ సక్సెస్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసారని రెబెల్ అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. బాహుబలి తర్వాత హిట్ కొట్టిన మా అన్న సక్సెస్ సెలబ్రేషన్స్ అద్దిరిపోయే రేంజ్ లో చేస్తారంటే ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news