Newsఎన్టీఆర్ హీరోయిన్‌ను సెట్ చేసుకుంటోన్న రామ్‌చ‌ర‌ణ్‌... అబ్బా ఏం క్రేజీ కాంబినేష‌న్‌రా...!

ఎన్టీఆర్ హీరోయిన్‌ను సెట్ చేసుకుంటోన్న రామ్‌చ‌ర‌ణ్‌… అబ్బా ఏం క్రేజీ కాంబినేష‌న్‌రా…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తుంటే.. రామ్ చరణ్
శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత వార్ 2 సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తాడు.

ఇటు గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్‌.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించే సినిమాలో నటిస్తాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వీరిలో జాన్వీ కపూర్‌ను ఓ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ ఇప్పుడు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా సహనటుడు అయిన రామ్ చరణ్ కు జోడిగా కూడా ఎంపిక కానుంది.

పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ కోసం జాన్వీని రామ్ చరణ్ పక్కన హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన.. ఉప్పెన‌ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత కిలారు వెంకట సతీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రంగస్థలం తరహాలో నేచురల్ అండ్ ర‌స్టిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news