Newsబన్నీ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తోనో తెలుసా..? పుష్ప కు...

బన్నీ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తోనో తెలుసా..? పుష్ప కు అమ్మ మొగుడి లాంటి హిట్ కన్ఫామ్ ..రాసిపెట్టుకోండి..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు . మహేష్ బాబు – చరణ్ – తారక్ -బన్నీ -ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు అందరూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు . అయితే మొదట నటించిన సినిమా హిట్ అయింది అంటే దానికి ట్రిపుల్ స్థాయిలోని సినిమా ఉండాలి అని ఆలోచించే బన్నీ పుష్ప సినిమా తర్వాత అలాంటి క్రేజీ హిట్ ఇచ్చే డైరెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు .

అయితే బన్నీ రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతకంటే మంచి ఆఫర్ బన్నీ ఖాతాలో వచ్చి చేరింది . జైలర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ – బన్నీకు అదిరిపోయే స్టోరీ వివరించారట . ఫుల్ టు ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కపోతుందట.

అయితే కథ చూసి టెంప్ట్ అయిపోయిన బన్నీ.. త్రివిక్రమ్ పర్మిషన్ తీసుకొని మరి ఈ సినిమాను ఓకే చేశారట. పుష్ప సినిమా తర్వాత అలాంటి హిట్ పడాలి అంటే నెల్సన్ దిలీప్ లాంటి డైరెక్టర్ కరెక్ట్ అంటూ భావించిన బన్నీ.. త్రివిక్రమ్ ను హోల్డ్ లో పెట్టారు.

ఆ సినిమా ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత తెరకెక్కిస్తారట . అందుతున్న సమాచారం ప్రకారం 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్క బోతుంది అన్ని ..పక్కాగా కుదిరితే పుష్పకు మించిన రేంజ్ లో ఉండే హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు బన్నీ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news