Newsప్ర‌భాస్ ' క‌ల్కి 2898 AD ' ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో రు....

ప్ర‌భాస్ ‘ క‌ల్కి 2898 AD ‘ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో రు. 2 వేలు కోట్లు ప‌క్కా… ఆ సీన్ ఇదే..!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్ లైన‌ప్‌లు ఇప్పుడు భారీ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ యేడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ క్రిస్మ‌స్ కానుక‌గా స‌లార్ సినిమాతో ఈ నెల 22న థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాడు. ఇక వ‌చ్చే యేడాది ప్ర‌భాస్ నుంచి వ‌స్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా క‌ల్కి 2898 AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ రు. 600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో కూడా అదిరిపోయే ట్విస్టులు ఉండ‌నున్నాయి.

ఇప్ప‌టికే స‌లార్ రెండు పార్టులుగా వ‌స్తోంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు క‌ల్కి సినిమా కూడా రెండు పార్టులుగానే రానుంది. ముందుగా ఈ సినిమాను ఒకే పార్ట్‌గా అనుకున్న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క‌థ డీటైల్‌గా చెప్పే క్ర‌మంలో ఈ సినిమాను కూడా రెండు పార్టులుగానే రిలీజ్ చేస్తున్న‌ట్టు సంకేతాలు ఇచ్చేశారు. ఇక ఈ సినిమా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ విష‌యంలో అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటాయ‌ని తెలుస్తోంది.

ఇంటర్వెల్ సీక్వెన్స్ లో విల‌న్‌గా న‌టిస్తోన్న ఉల‌గ‌నాయ‌క‌న్ కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుందని.. ప్రభాస్ క్యారెక్టర్ లోని సాలిడ్ వేరియేషన్ కూడా అదే టైంలో రివీల్ అవుతుంద‌ని.. క‌రెక్టుగా అదే టైంలో మ‌రో ఎండ్ నుంచి అమితాబ‌చ్చ‌న్ పాత్ర ఎంట్రీ ఉంటుంద‌ని.. అస‌లు ఈ ముగ్గురిలో ఎవ‌రి పాత్ర‌కు ఎలా లింక్ ఉంటుంద‌న్న సీన్లు అప్పుడు వ‌స్తాయ‌ని.. ఆ సీన్ల‌కు థియేట‌ర్ల‌లో అరుపులు,కేక‌లు మామూలుగా ఉండ‌వ‌ని తెలుస్తోంది.

ఈ ఒక్క సీన్‌తోనే స‌గం టిక్కెట్‌కు న్యాయం జ‌రిగిన‌ట్లు అవుతుంద‌ని.. వెయ్యి కోట్లు ప‌క్కా అని.. ఇక ఓవ‌రాల్‌గా ఈ సినిమా రు. 2 వేల కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని.. హాలీవుడ్ రేంజ్‌లో కూడా ఈ ప్రాజెక్ట్ క్లిక్ అవుతుంద‌న్న అంచ‌నాలు ఉన్న‌ట్టు టాలీవుడ్‌లో చ‌ర్చ న‌డుస్తోంది. మే 9న క‌ల్కి సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news