Moviesన్యూ ఇయర్ గిఫ్ట్ గా అభిమానులకి ఎన్టీఆర్ బిగ్ సర్ప్రైజ్ .....

న్యూ ఇయర్ గిఫ్ట్ గా అభిమానులకి ఎన్టీఆర్ బిగ్ సర్ప్రైజ్ .. నా సామీ రంగా అద్దిరిపోయిందంతే..!!

ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో న్యూయార్ కి వెల్ కమ్ చెప్పడానికి భారీ స్థాయిలో ఏర్పాటు చేసుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా బడాబడా స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా విదేశాలలో న్యూ ఇయర్ ని వెల్కమ్ చెప్పడానికి ఇప్పటికే తమ ఫేవరెట్ ప్లేసెస్ కి వెళ్ళిపోయారు. చాలామంది ఇండియాలోని తమ న్యూ ఇయర్ ని వెల్కమ్ చేయడానికి రెడీ అవుతున్నారు . ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ న్యూ ఇయర్ వెకేషన్ కోసం జపాన్ వెళ్లిపోయారు .

ఆయన తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు . కాగా న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకి సరికొత్త సర్ప్రైజ్ ను అందించారు జూనియర్ ఎన్టీఆర్. తన నుంచి కొత్త ఏడాది క్యాలెండర్ గా ఓ పిక్ ని రిలీజ్ చేశారు. ఈ సరికొత్త లుక్ కి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. తారక్ ఈ ఫోటోలో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండడం ఒక ప్లస్ అయితే అచ్చం నిన్ను చూడాలి అని ఉంది అనే రోజులని గుర్తు చేస్తూ ఉండడం మరొక ప్లస్ గా మారింది .

ఈ పిక్స్ చూస్తుంటే అచ్చం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కి ముందు పార్టీకి రెడీ అయి ఇన్నోసెంట్ లుక్ లో ఉన్నట్టు క్యూట్గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫ్రెష్ లుక్ ఫ్యాన్స్ ని ఫిధా చేస్తుంది. కొత్త ఏడాదికి ఒక పవర్ కిక్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ ఫోటో . దీనితో ఈ న్యూ లుక్ న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . ప్రజెంట్ తారక్ కి సంబంధించిన ఈ లుక్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news