Newsఆ హీరోయిన్‌ను వ‌దిలేసి శ్రీలీలతో మొద‌లు పెట్టిన మ‌హేష్‌బాబు...!

ఆ హీరోయిన్‌ను వ‌దిలేసి శ్రీలీలతో మొద‌లు పెట్టిన మ‌హేష్‌బాబు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల జంట‌గా తెర‌కెక్కుతోన్న సినిమా గుంటూరుకారం. మ‌ట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో 2010లో వ‌చ్చిన ఖ‌లేజా సినిమా త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

గుంటూరుకారం సినిమాపై అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. ఇక మాస్ మ‌సాలా ఎంట‌ర్టైన‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు – మీనాక్షి చౌద‌రి కాంబినేష‌న్లో తెర‌కెక్కించాల్సిన సీన్లు అన్నీ షూట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు మీనాక్షి చౌద‌రి సైడ్ అవ్వ‌డంతో శ్రీలీల – మ‌హేష్ కాంబినేష‌న్లో ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే సీన్లు షూట్ చేస్తున్నార‌ట‌.

మ‌హేష్ – శ్రీలీల కాంబినేష‌న్లో వ‌చ్చే సీన్లు మాంచి రొమాంటిక్‌గా ఉంటాయ‌ట‌. ఇక శ్రీలీల – మ‌హేష్ మ‌ధ్య వ‌చ్చే ఓ సాంగ్‌ను కూడా షూట్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ బ్యూటిఫుల్ సాంగ్‌ను కేర‌ళ‌లో షూట్ చేస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం అదిరిపోయే ట్యూన్ సెట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా మీనాక్షి – మ‌హేష్ కాంబినేష‌న్ కంటే శ్రీలీల – మ‌హేష్ కాంబినేష‌న్ వెండితెర మీద చూసేందుకు తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్న‌ట్టే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news