Movies"ఎన్ని జన్మలు ఎత్తినా అది జరగని పని".. ఎన్టీఆర్ పై కళ్యాణ్...

“ఎన్ని జన్మలు ఎత్తినా అది జరగని పని”.. ఎన్టీఆర్ పై కళ్యాణ్ రామ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో కళ్యాణ్రామ్ ఎన్టీఆర్ లకి మధ్య ఫైటింగ్ నడుస్తుంది అని ..అందుకే బింబిసారా -అమిగోస్ సినిమాలను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్ డెవిల్ సినిమా ప్రమోషన్స్ ను మాత్రం అస్సలు పట్టించుకోవడంలేదని ..అందుకే ఆ సినిమా రిలీజ్ అవుతున్న రెండు రోజుల ముందే జపాన్ టూర్ అంటూ వెళ్లిపోయాడు అని ..

సోషల్ మీడియాలో కొందరు నోటికొచ్చినట్లు వాగారు. కొందరు చెత్త కామెంత్స్ కూడా చేశారు. అంతేకాదు డెవిల్ సినిమాకి ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం లేదు అంటూ తెగ ప్రచారం చేశారు. అయితే దీనిపై రీసెంట్గా కళ్యాణ్ రామ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు . “ఎదుటి వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ..మాకు అనవసరం.. మా ఇద్దరి అన్నదమ్ముల మధ్య బంధం చాలా స్ట్రాంగ్ “

“మా రిలేషన్షిప్ ఎప్పుడూ బాగుంటుంది ..మమ్మల్ని విడగొట్టాలి అని చూస్తున్న వాళ్లకు అది ఎప్పటికీ జరగని పని అని తెలియదు .. ఎన్ని జన్మలెత్తినా సరే మా ఇద్దరి మధ్య బంధం ఇలానే ఉంటుంది” అంటూ కళ్యాణ్ రామ్ ట్రోలర్స్ కు ఇచ్చి పడేశారు. కాగా కళ్యాణ్ రామ్ లెటేస్ట్ గా హీరోగా నటించిన సినిమా డెవిల్. సం యుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news