Moviesకళ్యాణ్ రామ్ "డెవిల్" ట్విట్టర్ టాక్: హిట్టా..ఫట్టా..? నందమూరి...

కళ్యాణ్ రామ్ “డెవిల్” ట్విట్టర్ టాక్: హిట్టా..ఫట్టా..? నందమూరి ఫ్యాన్స్ డీప్ హర్ట్..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా “డెవిల్”. హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో ఆయనకు జంటగా నటించింది . ఫుల్ టు ఫుల్ పిరియాడిక్ ఏజెంట్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ డెవిల్ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . ఈ సినిమాకు దర్శకుడు అభిషేక్ నామ దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 29న గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు బింబిసార తర్వాత అమిగోస్ లాంటి ఫ్లాప్ అందుకున్న కళ్యాణ్ రామ్ కి డెవిల్ మంచి కం బ్యాక్ ఇచ్చిన మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది పీరియాడిక్ ఫిక్షనల్ మూవీ అని .. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా రాలేదు అని పొగిడేస్తున్నారు .

బ్రిటిష్ ప్రభుత్వం కోసం ఏజెంట్గా పని చేసిన ఇండియన్ గా కళ్యాణ్ రామ్ నటించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది . ఈ సినిమాకి మరో హైలెట్ పెర్ఫార్మన్స్ సంయుక్త మీనన్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ ట్విస్ట్ కేకో కేక అంటున్నారు.. క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఫస్ట్ హాఫ్ పాత్రలను పరిచయం చేసి.. ఇంటర్వెల్ ట్విస్ట్ అద్దిరిపోయేలా చేశాడు. సెకండ్ హాఫ్ ముందుకు నెట్టుకెళ్తూ క్లైమాక్స్ ని బిస్కెట్ చేసేసారని.. కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే డెవిల్ సినిమా ఒకసారి థియేటర్ కి వెళ్లి చూడొచ్చు అన్న విధంగానే కామెంట్స్ చేస్తున్నారు .చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news