Moviesగుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండ్రా అబ్బాయిలు.. మరో హీరో అయితే...

గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండ్రా అబ్బాయిలు.. మరో హీరో అయితే ఈ సీన్ చేసుండే వాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు రెబెల్ ఫాన్స్ . సలార్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సలార్ సినిమాకి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం చదువుతున్నాం చూస్తున్నాం. దానికి కారణం కూడా లేకపోలేదు . బాహుబలి తర్వాత ఒక్క హిట్ కొట్టలేకపోయిన ప్రభాస్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది .

అందుకే రెబల్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రెబల్ ఫ్యాన్స్ ఆనందాన్ని కొందరు కావాలని స్పాయిల్ చేస్తున్నారు . సినిమాలో అసలు ఏమీ లేదని క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్ కే ఇవ్వాలి అని ఆయన డైరెక్షన్ బాగుంది తప్పిస్తే మిగతా వాళ్ళ పెర్ఫార్మన్స్ పెద్దగా హైలెట్ కావడం లేదని.. ం ప్రభాస్ ప్లేస్ లో మరి ఏ హీరో ఉన్నా కూడా ఆ సినిమా హిట్ అయ్యేదని.. అంతా క్రెడిట్ ప్రశాంత్ నీల్ కే దక్కాలి అంటూ ట్రోల్ చేశారు .

అయితే రెబల్ ఫ్యాన్స్ సినిమాలోని కొన్ని సీన్స్ ని హైలెట్ చేస్తూ ఇలాంటి సీన్స్ లో మరి ఏ హీరో అయిన నటిస్తాడా చెప్పండి..? అంటూ ప్రమోట్ చేస్తున్నారు. సినిమాలో ఓ సీన్లో ప్రభాస్ ఒడిలో పృథ్వీరాజ్ తల పెట్టుకొని పడుకుంటాడు . ఇది చాలా ఫ్రెండ్లీ నేచర్ మూమెంట్లో జరుగుతుంది . అయితే ఈ సీన్ ని వేరే ఏ హీరో అయిన నటించడానికి ఒప్పుకుంటాడా ..?చెప్పండి అంటూ రెబల్ ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు .

చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇష్టపడరు . ఎందుకంటే ఒకానొక సమయంలో ఎక్కడైనా మన స్టార్ స్టేటస్ తగ్గిపోయే సీన్స్ ఉంటాయి అని భయం . అయితే ప్రభాస్ మాత్రం సలార్ విషయంలో ఏం పట్టించుకోలేదు . ప్రశాంత్ నీల్ చెప్పింది చెప్పినట్లు ఫాలో అయిపోయాడు. సినిమాలో కొన్ని సీన్స్ లో ప్రభాస్ కన్నా పృథ్వీరాజ్ హైలెట్ అయ్యాడు . అయినా సరే ప్రభాస్ ఏ మాత్రం పట్టించుకోలేదు అది రెబల్ స్టార్ స్టామినా – నమ్మకం అంటే అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. నిజానికి ఏ తెలుగు హీరో కూడా సెలార్ సినిమాను యాక్సెప్ట్ చేయలేడు చెయ్యడు కూడా.. ఎందుకంటే ఈ సినిమా ప్రభాస్ కోసమే పుట్టింది ..ప్రభాస్ కే ఈ సినిమా దక్కాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news