Newsఆశిష్ పెళ్లి చేసుకోబోయే ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? దిల్ రాజునే...

ఆశిష్ పెళ్లి చేసుకోబోయే ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? దిల్ రాజునే మించిపోయే సౌండ్ పార్టి..కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసురాలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా ఎంగేజ్ లో ఉండగానే హీరోలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. పట్టుమంటూ పది సినిమాలో నటించకుండా హిట్ ట్రాక్ ఎక్కకుండానే లైఫ్ లో సెటిలైపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ . దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి సినిమా రౌడీ బాయ్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు .

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు తన సోదరుడు శిరీష్ కొడుకు ఆశీష్ ను ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేశారు . ప్రజెంట్ ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు .అయితే ఆ సినిమాలు రిలీజ్ అవ్వకుండానే పట్టుమంటూ పది సినిమాలు కూడా చేయకుండానే ఈ కుర్ర హీరో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయాడు . నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాడు . ఏపీకి చెందిన బడా వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డితో ఆశీస్సులు నిశ్చితార్థం ఘనంగా జరిగింది .

ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫంక్షన్ కి ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు . చాలా సైలెంట్గా సింపుల్ గా కుటుంబ సభ్యులు మాత్రమే వీళ్ల నిశ్చితర్ధాన్ని ఘనంగా చేశారు . అయితే ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో కాబోయే కొత్తజంటకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫాన్స్ విషెస్ అందిస్తున్నారు .

దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు నిశ్చితార్థం ఇంత ఫాస్ట్ గా జరిగిపోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇది ప్రేమ వివాహం . అంతేకాదు ఇద్దరు ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఆ అమ్మాయి వేలకోట్ల ఆస్తికి వారసురాలు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఏది ఏమైన మంచి సౌండ్ పార్టీ నే పట్టాడు ఆశిష్ అంటూ కొందరు నాటీ కామెంత్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news