News' స‌లార్ ' టిక్కెట్లు కావాలా... అయితే అప్ప‌టి వ‌ర‌కు వెయిటింగ్...

‘ స‌లార్ ‘ టిక్కెట్లు కావాలా… అయితే అప్ప‌టి వ‌ర‌కు వెయిటింగ్ త‌ప్ప‌దు…!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలిమ్స్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ సినిమా స‌లార్‌. రెండు పార్టులుగా రిలీజ్ అవుతోన్న స‌లార్‌పై దేశ‌వ్యాప్తంగా క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న థియేట‌ర్ల‌లోకి రావాల్సి ఉంది. అయితే క్రిస్మ‌స్ కానుక‌గా ఈ నెల 22న స‌లార్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు అంచ‌నాలు పెంచేయ‌గా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ అయితే ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు బాగా న‌చ్చింది. స‌లార్ ఇండియాలోనే కాకుండా.. అటు ఓవ‌ర్సీస్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. స‌లార్ టిక్కెట్ల కోసం భార‌తీయ యువ‌త అయితే పిచ్చెక్కిపోయేలా వెయిట్ చేస్తున్నారు.

టిక్కెట్లు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా ? అన్న ఉత్కంఠ ఒక్క‌టే ఉంది. ఇక ఇండియాలో డిసెంబర్ 15 నుంచి స‌లార్ టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మేకర్స్ అఫీషియల్ గా ప్ర‌క‌టించేశారు. అంటే స‌లార్ టిక్కెట్లు కావాల్సిన వారు డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

స‌లార్‌లో ప్ర‌భాస్‌కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా.. ఈ సినిమాలో ప్ర‌ముఖ మ‌ళ‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరరావు కీలక పాత్రలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news