Newsమహేష్‌బాబు AMB సినిమాతో యేడాదికి ఎన్ని కోట్ల ఆదాయ‌మో తెలుసా... !

మహేష్‌బాబు AMB సినిమాతో యేడాదికి ఎన్ని కోట్ల ఆదాయ‌మో తెలుసా… !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటు సినిమాల సంపాదనతో పాటు అటు వ్యాపార పరంగా కూడా యేడాదికి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. మహేష్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌కు మంచి బిజినెస్ మైండ్ ఉందని మహేష్ సంపాదించిన కోట్లాది రూపాయలను ఆమె పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ వ్యాపార పరంగా కూడా ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేలా.. రకరకాల ప్రణాళికలు నమ్రత రచిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎంతో ఇష్టంగా పెట్టుబడి పెట్టిన మాల్ AMB మాల్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఈ మాల్ నిర్మించారు. AMB మాల్ తాజాగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2018లో ప్రారంభమైన ఏఎంబి మాల్ ఇటీవల ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో విజయోత్సవాలు కూడా చేశారు.

ఒకప్పుడు హైదరాబాద్ సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. లేదా కూకట్‌ప‌ల్లి సెంటర్ అన్న పేరు ఉండేది. ఎప్పుడు అయితే AMB మాల్ కట్టారో అప్పటినుంచి హైదరాబాద్ సినిమా సందడి అంతా AMB మాల్ కేంద్రంగానే నడుస్తోంది. ఇక ఈ మాల్ ద్వారా మహేష్ బాబుకు ఏడాదికి అన్ని ఖర్చులు పోను రూ.18 నుంచి రూ.20 కోట్లకు పైగా లాభాలు మిగులుతాయి. ఈ మాల్ నిర్వహణ అంతా ఏషియన్ సినిమాస్ వాళ్ళతో కలిసి న‌మ్ర‌త శిరోద్క‌ర్ చూసుకుంటూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news