Newsయానిమల్ సినిమా ఎఫెక్ట్: జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా.....

యానిమల్ సినిమా ఎఫెక్ట్: జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా.. మరో 10ఏళ్ళు ఇండస్ట్రీలో ఢోకా లేదు పో..!!

ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్నా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అంతకుముందు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ బ్యూటీ యానిమల్ సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ ట్రెండ్ అవ్వడం స్టార్ట్ చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎప్పుడూ లేనివిధంగా బోల్డ్ గా నటించడమే ఆమె పేరు మారుమ్రోగిపోవడానికి కారణం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

అయితే రష్మిక మందన్నా ప్రజెంట్ తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తుంది . తాజాగా నాలుగో సినిమాను సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్నాను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్.

ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్స్ ని అనుకున్న ఫైనల్లీ యానిమల్ సినిమా చూశాక ఈ పాత్రకు రష్మికానే కరెక్ట్ అంటూ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారట . అంతేకాదు ఈ సినిమాల్లో మాస్ మహారాజా తో నాటు నాటు స్టెప్స్ వేయబోతుంది రష్మిక అంటూ కూడా టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రవితేజతో ఘాటు లిప్ లాక్ కూడా చేయబోతుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news