Moviesక‌ళ్లు చెదిరిపోయే యాక్ష‌న్‌.... విక్ర‌మ్‌ ' ధృవన‌క్ష‌త్రం ' ట్రైల‌ర్ (...

క‌ళ్లు చెదిరిపోయే యాక్ష‌న్‌…. విక్ర‌మ్‌ ‘ ధృవన‌క్ష‌త్రం ‘ ట్రైల‌ర్ ( వీడియో)

కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీన‌న్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ధ్రువ నక్షత్రం. తమిళంలో ధృవ నక్షత్రం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో ఈ నెల 24న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. గౌతమ్ సినిమాలు యాక్షన్‌కు పెట్టింది పేరు. గౌతమ్ మీన‌న్ టేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ధృవ నక్షత్రం సినిమా రెండు మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు థియేటర్ ట్రైలర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అధ్యంతం ఆసక్తిగా సాగింది. ఒకే లక్ష్యాలు, ఆలోచనలు పంచుకునే వారితో బేస్మెంట్ పేరుతో ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసి ఒక మిషన్ ఎలా ? చేధించారు అన్నది ఈ సినిమా కథాంశం. క్రికెట్ టీంలా ఒక 11 మంది టీం దేశాన్ని కాపాడేందుకు ఎలా ?ఏర్పడ్డారు. వారు చట్టానికి కట్టుబడి ఉండరు… ఎలాంటి విధానాలను అనుసరించరు… వారు అనుకున్నది తమదైన స్టైల్ లో సాధించ‌డ‌మే ఈ సినిమా స్టోరీ.

హీరో విక్రమ్ కూడా ఇందులో భాగంగా ఉంటాడు. ఈ టీం ఎజెండా ఏమిటి.. వారి దేనికోసం పోరాడుతున్నారు.. అనేది ఆసక్తిగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌లో యాక్షన్స్ స‌న్నివేశాలు అదిరిపోయాయి. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చియాన్ విక్రమ్ ట్రైలర్‌లో సూపర్‌గా ఆకట్టుకున్నారు.

రీతు వర్మ, పార్తీబ‌న్‌, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్‌దాస్, దివ్యదర్శని ఇందులో కీలకపాత్రలు పోషించారు. హరీష్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమా అయితే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అదిరిపోతుందని క్లారిటీ వచ్చేసింది. ఇక వెండితెరపై విక్రమ్ విశ్వరూపం చూడటం ఒకటే మిగిలి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news