News' ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ' ఇంట‌ర్వెల్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్‌కు క‌నెక్ష‌న్ ఏంటి... అదే...

‘ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ‘ ఇంట‌ర్వెల్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్‌కు క‌నెక్ష‌న్ ఏంటి… అదే హ‌రీష్ శంక‌ర్ ట్విస్ట్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ల ప్లాటు వరుస ఫ్లాపుల తర్వాత హరీష్‌శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో కమ్‌ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు పవన్ కళ్యాణ్ మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది రూపంలో మరో బ్లాక్ బస్టర్ పవన్ కు దక్కింది. పవన్ అభిమానులు కూడా గబ్బర్ సింగ్ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేరు.

ఇన్నేళ్ల తర్వాత మరోసారి గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో శ్రీ‌లీల‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్‌ని ది బెస్ట్‌గా ప్రజెంట్ చేయడంలో హరీష్‌శంకర్ స్టైల్ వేరు అని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా హరీష్‌శంకర్ పవన్ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు ఎంటర్ అవుతూ ఉంటాడు. గబ్బర్ సింగ్ సినిమాలో ఇంటర్వ్‌ల్ బ్యాక్ ఎలా ? హైలెట్ అయిందో చూసాం.

అది ఆ సినిమా సెన్సేషనల్ హిట్‌లో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా ఇంటర్వెల్ కూడా సేమ్. గబ్బర్ సింగ్ స్టైల్ లోనే హరీష్ శంకర్ రాసుకున్నాడట. జస్ట్ ఉస్తాద్‌ కోసం అంతా వెయిట్ చేయండి అంటూ హరీష్ తన ఎక్స్ లో కామెంట్ చేశాడు. డెఫినెట్‌గా గబ్బర్ సింగ్ ని మించే అదిరిపోయే ఇంటర్వ్‌ల్ బ్యాక్ ఉస్తాద్‌తో ప్లాన్ చేస్తున్నాడు అని హరీష్ చెప్పేశాడు. ఏది ఏమైనా హరీష్‌శంకర్ పవన్ ను మరోసారి గబ్బర్ సింగ్ రేంజ్‌లో చూపించబోతున్నాడు అన్నది అయితే క్లారిటీ వచ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news