News' అన్‌స్టాప‌బుల్ యానిమ‌ల్ ' ఎపిసోడ్ డేట్ ఫిక్స్‌... బాల‌య్య -...

‘ అన్‌స్టాప‌బుల్ యానిమ‌ల్ ‘ ఎపిసోడ్ డేట్ ఫిక్స్‌… బాల‌య్య – ర‌ష్మిక ర‌చ్చ రంబోలా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్‌ కేసరి. అఖండ, వీర సింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత బాలయ్య నటించిన భగవంత్‌ కేసరి సినిమా బాలయ్యకు వరుసగా మూడో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య – బాబీ దర్శకత్వంలో తన కెరీర్ లో 109వ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటు వరుస సినిమాలతో పాటు.. అటు బుల్లితెర ట్రెండ్ సెట్‌ చేసిన బ్లాక్‌బస్టర్ ఆన్‌స్టాపబుల్ షోను హోస్ట్ చేస్తూ బాలయ్య వీరంగం ఆడేస్తున్నాడు. తాజాగా అన్‌స్టాప‌బుల్‌ సీజన్ 3 కూడా స్టార్ట్ అయింది. అన్‌స్టాప‌బుల్‌ సీజన్ 3ని లిమిటెడ్ ఎపిసోడ్లతో రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అయ్యింది. గత రెండు సంవత్సరాలుగా ఈ సీజన్‌లో మోస్ట్ అవైటెడ్‌గా ఉన్న క్రేజీ ఎపిసోడ్ ఏదన్నా ఉంది అంటే అది అన్‌స్టాప‌బుల్ మాత్రమే అని చెప్పాలి.

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాపై దేశవ్యాప్తంగా కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో పాటు ట్రైలర్ అదిరిపోయింది. సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా ? అని యువత అయితే పిచ్చెక్కిపోయేలా ఉన్నారు. యానిమల్ ప్రమోషన్లు కూడా ప్రారంభమయ్యాయి.

తాజాగా ఈ సినిమా హీరో, హీరోయిన్లు, దర్శకుడు ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య షో కి వచ్చారు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ క్రేజీ ఎపిసోడ్.. రిలీజ్ డేట్ స్ట్రీమింగ్‌ను ఆహా వారు రివీల్ చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ నవంబర్ 24న స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రోమో కట్‌తో కన్ఫర్మ్ చేశారు. ఈ ఎపిసోడ్లో రష్మిక, బాలయ్య కలిసి ఒక రేంజ్‌లో రచ్చ చేసినట్టు తెలుస్తోంది. గతంలో కూడా రష్మిక.. బాలయ్య ఎపిసోడ్ కు వచ్చి అదరగొట్టేసింది. ఏది ఏమైనా ఈ సారి ఎపిసోడ్ తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని క్లారిటీ వచ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news