News"తారక్ కి తిక్క రేగితే ఇలానే ఉంటాది".. ఓటు వేయడానికి క్యూలో...

“తారక్ కి తిక్క రేగితే ఇలానే ఉంటాది”.. ఓటు వేయడానికి క్యూలో ఉన్న ఎన్టీఆర్ ఏం చేశాడో చూడండి(వీడియో)..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చోని ఉండగా అక్కడ మీడియా వాళ్ళు ఆయనను ఆయన భార్యను ఆయన తల్లిని ఫొటోస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపించారు . మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మైకులు కెమెరాలు పట్టుకుని గంటలు గంటలు ఆ పోలింగ్ బూత్ వద్ద ఉండడం తారక్ గమనించారు.

ఈ క్రమంలోని అక్కడే ఉన్న మీడియా వాళ్ళను తారక్ ప్రశ్నిస్తూ..” ఏంటి మీరు ఓటు వేయరా..?” అంటూ ప్రశ్నిస్తారు . దీంతో మీడియా ప్రతినిధి “వేస్తాం సర్ ..మీరు వేసేశాక మేము వేస్తాం” అంటూ సమాధానం ఇస్తారు . అంతేకాదు “మాలో అందరూ కూడా వెయ్యరు ..కొంతమంది వేస్తారు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు .

అసలే తెలంగాణలో పోలింగ్ శాతం పడిపోయింది .. ఓట్లు వేయ్యండి రా బాబు అంటూ ప్రతినిధులు మైకులలో అనౌన్స్ చేస్తున్నారు . అయితే ఇక్కడ ఈ మీడియా ప్రతినిధి మాత్రం ఓపెన్ గా ఓట్లు వేయమని చెప్పడం ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు తారక్ కూడా ఆయన చెప్పిన ఆన్సర్ కు షాక్ అయిపోయాడు. ప్రెసెంట్ ఈ వీడియో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news