News' టెంప‌ర్ ' సినిమా రిలీజ్ రోజు ఎన్టీఆర్ ఆనందానికి హ‌ద్దులు...

‘ టెంప‌ర్ ‘ సినిమా రిలీజ్ రోజు ఎన్టీఆర్ ఆనందానికి హ‌ద్దులు లేకుండా చేసిన ఫొటో ఇది… !

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎన్ని చెప్పినా అంతిమంగా సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరైతే సక్సెస్ లో ఉంటారో వాళ్లకు దర్శకనిర్మాతలు ప్రాధాన్యత ఇచ్చిన స్థాయిలో ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు ప్రాధాన్యత ఇవ్వరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఈ తరహా అనుభవాలు రెండుసార్లు ఎదురయ్యాయి. సింహాద్రి సినిమా తర్వాత వరుసగా 5 సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ కు షాకిస్తే బృందావనం తర్వాత 6 ఫ్లాపులు తగిలాయి.

శక్తి, బృందావనం, దమ్ము, బాద్ షా, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు తారక్ ను నిరాశకు గురి చేశాయి. బాద్ షా బెటర్ మూవీనే అయినా ఊహించని స్థాయిలో ఖర్చు చేయడంతో ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే టెంపర్ సినిమా రిలీజ్ కు ముందు జరిగిన ఆడియో లాంఛ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన తారక్ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు ఉంటాయని మాటిచ్చారు.

పూరీ జగన్నాథ్ ఫామ్ లో లేకపోయినా ఆయన టాలెంట్ ను నమ్మి తారక్ ఛాన్స్ ఇవ్వగా 2015 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన టెంపర్ రిలీజైంది. టెంపర్ ఫస్టాఫ్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది నిరాశకు గురయ్యారు. తారక్ మరోసారి నిరుత్సాహపరుస్తాడేమో అని ఫీలయ్యారు. టెంపర్ ఇంటర్వెల్ సమయానికి ఫ్యాన్స్ సైతం సైలెంట్ అయిపోయారు. అయితే సెకండాఫ్ లో ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ ఈ సినిమాను హిట్ చేశారు.

ఈ సినిమా రిలీజ్ రోజున చాలాసేపు వెయిట్ చేసినా తారక్ కు సినిమా గురించి ఎలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదట. సినిమాకు సంబంధించిన రెస్పాన్స్ తెలియక తారక్ కంగారు పడుతున్న సమయంలో ఒక ఫ్యాన్ కాలర్ ఎగరేసిన ఫోటోను పంపి బొమ్మ బ్లాక్ బస్టర్ అని సందేశం ఇచ్చాడు. ఆ మెసేజ్ జూనియర్ ఎన్టీఆర్ కు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందట. టెంపర్ మూవీ ఫుల్ రన్ షేర్ కలెక్షన్లు 43 కోట్ల రూపాయలు కాగా అప్పటినుంచి ఇప్పటివరకు తారక్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news