Newsప‌వ‌న్ - బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెట్టిన నితిన్‌... ర‌చ్చ...

ప‌వ‌న్ – బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెట్టిన నితిన్‌… ర‌చ్చ రంబోలా అయ్యిందిగా…!

యంగ్ హీరో నితిన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు కూడా నితిన్ తన సినిమాలలో పవన్ కళ్యాణ్ స్టైల్ ఫాలో అవుతూ పవన్ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. తాజాగా నితిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్, మరో మెగా హీరో అల్లు అర్జున్ అభిమానుల మధ్య మంట పెట్టేసాయి.

నితిన్ మాట్లాడుతూ తాను హీరోను అయినా.. కాకపోయినా పవన్ కళ్యాణ్ అభిమానిని అని కొంతమందిలా ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత పేరు ప్రస్తావించకుండా వదిలేయడం లాంటివి చేయను.. నేను సాధారణ కుర్రాడిలా ఉంటాను.. ఒకసారి ఫ్యాన్ అంటే లైఫ్ లాంగ్ ఫ్యాన్ అని అర్థం.. ఇప్పుడు అభిమానిని అని చెప్పుకునే రేపు ఒక రేంజ్ వచ్చాక నేను ఫ్యాన్ కాదు, నాకు నేనే అభిమానిని అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు.. అని నితిన్ చెప్పాడు.

నితిన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమాని ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పి తన ప్రేమ చాటుకున్నాడు. అయితే ఈసారి నితిన్ ఇచ్చిన స్టేట్మెంట్ బన్నీ ఫ్యాన్స్ కు మంట పెట్టేసింది. పవన్ అభిమానులు నితిన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్‌ను బన్నీ ఫ్యాన్స్ కు ట్యాగ్‌ చేస్తున్నారు. బన్నీ కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్‌ను ఒక రేంజ్ లో పొగిడి.. ఒక స్థాయి వచ్చాక పవన్ గురించి మాట్లాడమని అంటే చెప్పను బ్రదర్.. అనటం కరెక్ట్ కాదని.. నితిన్ ని చూసి బన్నీ నేర్చుకోవాలని అతడి కామెంట్ వైరల్ చేస్తున్నారు.

దీంతో బన్నీ అభిమానులు రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. తన ప్రసంగాలలో పవన్ చెప్పిన కొన్ని కామెంట్లను ఇప్పుడు తెర మీదకు తీస్తున్నారు. చిరంజీవి అంటే ఇష్టం అని కొన్ని ప్రసంగాల్లో చెప్పిన పవన్‌.. మరికొన్ని సందర్భాల్లో చిరంజీవిపై నెగిటివ్గా చేసిన వ్యాఖ్యలని కట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నితిన్ చేసిన కామెంట్లు బన్నీ, పవన్ అభిమానుల మధ్య సరికొత్త సోషల్ మీడియా యుద్ధానికి కారణమయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news