Newsనాగార్జునతో రొమాన్స్ అంటే హీరోయిన్ల‌ను ఎందుకు ఇష్టం... కింగ్ అక్క‌డ మాయ‌లో...

నాగార్జునతో రొమాన్స్ అంటే హీరోయిన్ల‌ను ఎందుకు ఇష్టం… కింగ్ అక్క‌డ మాయ‌లో పెట్టేస్తాడా…!

అక్కినేని అందగాడు నాగార్జునకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే చెప్పవచ్చు. బిగ్ బాస్ షో ద్వారా హోస్ట్ గా మంచి మార్కులు వేయించుకుంటున్న నాగ్ నా సామిరంగ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. సాధారణంగా సీనియర్ హీరోలకు జోడీగా నటించాలంటే హీరోయిన్లు జంకుతారు. అయితే నాగార్జునతో మాత్రం రొమాన్స్ చేయడానికి హీరోయిన్లు ఎంతగానో ఇష్టపడతారు.

నాగార్జునతో హీరోయిన్లు రొమాన్స్ ను ఇష్టపడటానికి, ఆయన సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపడానికి సైతం వేర్వేరు కారణాలు ఉన్నాయి. నాగార్జున సెట్స్ లో సరదాగా ఉంటారని, హీరోయిన్ల కంఫర్ట్ కు ప్రాధాన్యత ఇస్తారని, ఏదైనా సీన్ లో సరిగ్గా యాక్ట్ చేయకపోయినా కూల్ గా చెబుతారని, ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారని ఈ రీజన్ వల్లే హీరోయిన్లు సైతం నాగార్జునకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.

నాగార్జున అనుష్క మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలలో నాగార్జునతో చేసినన్ని సినిమాలు అనుష్క మరే హీరోతో చేయలేదు. ఏఎన్నార్ కూడా హీరోయిన్లతో సరదాగా ఉండేవారని ఎన్టీఆర్ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండేవారని తెలుస్తోంది. నాగార్జున నా సామిరంగ సినిమా విషయానికి వస్తే ప్రసన్న కుమార్ కథ అందించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా నాగార్జున మాత్రం పోటీ విషయంలో తగ్గేదేలే అని చెబుతున్నారు. సీనియర్ హీరోలలో కేవలం 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో నాగార్జున కాగా నా సామిరంగ సక్సెస్ సాధిస్తే నాగ్ పారితోషికం అమాంతం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నాగ్ సినిమాలకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో నాగ్ సంచలన విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news