Newsమెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమా నిర్మించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌.. ఆ సినిమా...

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమా నిర్మించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌.. ఆ సినిమా ఇదే..!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ టాలెంటెడ్ నటులు. వీరిద్దరూ అనేక పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎన్నో వండర్ఫుల్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి కంటే ముందుగానే స్టార్ అయిన సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి సినిమాని నిర్మించారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

కృష్ణ నిర్మించిన చిరంజీవి సినిమా ఆషామాషీ సినిమా కాదు. తెలుగు సినీ పరిశ్రమ గతినే మార్చిన సినిమా అది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 1983లో రిలీజ్ అయింది. సంయుక్తా మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవి జైలు నుంచి తప్పించుకుని స్మగ్లర్ల ముఠాపై పోరాటంలో పాల్గొన్న ఖైదీగా నటించారు. చిరంజీవి జెట్ స్పీడ్ డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు తెలుగు ఆడియన్స్‌ని మంత్రముగ్ధులు చేశాయి.

చిరంజీవి కెరీర్ లో ఇది తొలి కమర్షియల్ హిట్‌గా నిలవడ‌మే కాకుండా చిరంజీవిని తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని మెగాస్టార్ గా నిలబెట్టింది. అంతేకాదు 1984లో హిందీలో కూడా ఖైదీ రీమేక్ చేశారు. ఆ హిందీ రీమేక్‌ నిర్మాత ఎవరో కాదు మన సూపర్ స్టార్ కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను కృష్ణ నిర్మించారు. హిందీ వర్షన్ లో చిరంజీవి పాత్రను జితేంద్ర పోషించుగా మాధవి హీరోయిన్గా నటించింది.

సుమలత పాత్ర హేమమాలిని పోషించగా, రంగనాథ్ గా శతృఘ్న‌సిన్తా నటించగా, రావుగోపాల్ రావు విలన్ పాత్రను ఖాదిర్‌ ఖాన్‌ పోషించాడు. ఎస్ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలవడంతో పాటు నిర్మాతగా సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news