Newsరివ్యూ: జ‌పాన్‌.. ఇలాంటి సినిమాలు తీస్తే థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా.. సూప‌ర్...

రివ్యూ: జ‌పాన్‌.. ఇలాంటి సినిమాలు తీస్తే థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా.. సూప‌ర్ సెటైర్‌

టైటిల్‌: జ‌పాన్‌
నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, జితన్ రమేష్, విజయ్ మిల్టన్, కె ఎస్ రవి కుమార్
సినిమాటోగ్రఫీ: ఎస్ రవి వర్మన్
మ్యూజిక్‌: జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు మరియు ఎస్ ఆర్ ప్రభు
దర్శకుడు : రాజు మురుగన్
రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2023

ప‌రిచ‌యం:
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా, అను ఎమ్మానియేల్‌ హీరోయిన్గా దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా జపాన్. దీపావళి కనుకగా తెలుగు, తమిళ భాషల్లో మంచి బజ్‌తో రిలీజైన‌ ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జపాన్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది. ప్రేక్షకులను ఎంత మేర‌కు ? ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
హైదరాబాద్ సిటీలోని ఓ జ్యువెలరీ షాపులో రూ.200 కోట్ల విలువైన నగలు, ఆభరణాలు దోచేస్తారు. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడన్న అనుమానాలు మొదలవుతాయి. శ్రీధర్ (సునీల్) భవాని (విజయ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలో రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలుపెడతారు. అటు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతూ ఉంటారు. దోచుకున్న డబ్బుతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అను ఇమ్మానుయేల్) మీద మనసు పారేసుకుంటాడు. ఆమె కోసం జపాన్ వెళితే అతడిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అప్పుడు రాబరీ గురించి జపాన్ తెలుసుకుంటాడు. తాను ఆ దొంగతనం చేయలేదని పోలీసులతో చెబుతాడు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు..? ఈ కేసును పోలీసులు ఎలా..? పరిష్కరించారు. జపాన్ అంటే శ్రీధర్ ఎందుకు భయపడతాడు..? పోలీసులకు చెందిన సీక్రెట్లు జపాన్ దగ్గర ఏమున్నాయి..? చివరకు ఈ సినిమా ఏమైంది..? అన్నది వెండితెర మీద చూసి తెలుసుకోవాలి.

విశ్లేష‌ణ :
జపాన్ ప్రచార చిత్రాలతో పాటు కార్తీ డైలాగులు పలికిన తీరు ఈ సినిమాపై ప్రేక్షకులు చూపు పడేలా చేశాయి. అందులోను ఇది కార్తీ 25వ సినిమా కావటం కార్తీతో ఖైదీ, కాష్మోరా వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన డ్రీమ్ వారియర్ పిక్చర్ నిర్మించిన సినిమా కావడంతో జపాన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా స్టార్టింగ్ బాగుంటుంది. దొంగ – పోలీస్ మధ్య ఖ్యాట్ – మౌస్ గేమ్ టైపులో సినిమా ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే సినిమాపై ఉన్న ఆశలు తొలగిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. దొంగలించిన డబ్బులతో సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తీని చూపించారు.

సినిమాలోని.. సినిమాలో దొంగ, పోలీస్ రెండు క్యారెక్టర్లు కార్తి చేశారు. బహుశా దర్శకుడు అది కామెడీగా ఫీలై ఉంటాడేమో. కానీ స్క్రీన్ మీద ఆ సీన్ చూసే ప్రేక్షకుడు అస్సలు ఏమాత్రం ఫీల్ కాడు. పైగా ఆ తతంగం అంతా సాగదీసినట్టుగా ఉంటుంది. ఇది చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం ఇంట్రడక్షన్ సీన్ గుర్తుకొస్తుంది. జపాన్‌లో పేరుకు చాలా చోట్ల కామెడీ ఉన్నా.. అది అస్సలు వర్కౌట్ కాలేదు. మధ్య మధ్యలో కొన్ని నవ్వులు మాత్రమే ఉన్నాయి.

కామెడీ సీన్లు తీయాలంటే ఒక టైమింగ్ ఉండాలి.. యాస‌ మాత్రమే సరిగా ఉంటే సరిపోదు. సన్నివేశాల్లో కంటెంట్ ఉండాలి. జపాన్‌లో అది పూర్తిగా మిస్ఫైర్ అయింది. చివర్లో చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ బేస్ చేసుకుని సినిమా తీసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది అనిపిస్తుంది. సినిమాలో మెయిన్ హైలెట్ కార్తీ పాత్ర దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు. యాస, భాషా బాగున్నా గొప్ప నరేషన్ కనిపించదు. దర్శకుడు జపాన్ అనే ఒక యూనిక్ పాత్రను డిజైన్ చేసుకున్నా.. దానిని చాలా లిమిటెడ్ గా ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. సినిమాలో యాక్షన్ బ్లాక్‌లు, అక్కడక్కడ కొన్ని కామెడీ బిట్స్ బాగున్నాయి.

సునీల్ మరోసారి కోలీవుడ్ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ పాత్ర చేసి షైన్ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో చిన్న ఎమోషనల్ సీన్ అదిరిపోతుంది. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ బాగున్నా.. సెకండాఫ్ డల్ అయిపోతుంది. పెద్దగా ఆకట్టుకునే ఎమోషన్స్ కానీ, ట్విస్టులు కానీ ఉండవు. దీంతో సినిమా చాలా చోట్ల పేలవంగా అనిపిస్తుంది. అక్కడక్కడ కార్తీ కామెడీ ప్రేక్షకుడికి పెద్ద రిలీఫ్. అది కూడా లేకపోతే సినిమా మరింత బోర్ అయిపోయేది. హీరోయిన్‌ అను ఇమ్మానియేల్ పాత్రకి సరైన స్కోప్ లేదు. చాలా లిమిటెడ్ స్క్రీన్ టైంలోనే ఆమె అలా కనిపించి వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ కోసం కార్తీపడిన కష్టం స్పష్టంగా కనిపించింది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నిక‌ల్‌గా చూస్తే జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి. రవివర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీ కాస్ట్యూమ్స్ సూపర్. తెలుగు వెర్షన్ ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ బాగా కుదిరాయి. దర్శకుడు రాజు మురుగ‌న్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో కార్తీ చేసిన క్యారెక్ట‌ర్ మినహా ఆకట్టుకునే అంశాలు లేవు. అక్కడక్కడ కొంచెం కామెడీ నరేషన్ బాగుంది. కొన్ని సీన్లు, కొన్ని ట్విస్టులు గత సినిమాలలో చూసినట్టుగానే ఉంటాయి. ఏది ఏమైనా రాజు మురుగన్ పనితీరు పూర్తిగా తేలిపోయినట్టుగా ఉంటుంది.

ఫైన‌ల్‌గా…
జ‌పాన్‌లో కార్తీ న‌ట‌న‌.. యాస సూప‌ర్బ్‌.. అయినా సినిమా మాత్రం డిజ‌ప్పాయింట్ చేసింది. సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. థియేటర్లకు జనాలు రావడం మానేశారు అని. మ‌రి ఇలాంటి సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ఎలా ? వ‌స్తారో ? వాళ్ల‌కే తెలియాలి.

ఫైన‌ల్ పంచ్‌: యాస‌, భాషే కాదు సినిమాలో ద‌మ్ము లేక‌పోతే జ‌పానే అవుతుంది కార్తీ..

జ‌పాన్ రేటింగ్‌: 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news