Newsపుష్ప, యానిమల్ మహేష్ రిజెక్ట్ చేయడానికి ఆ భ‌య‌మే కార‌ణ‌మా...!

పుష్ప, యానిమల్ మహేష్ రిజెక్ట్ చేయడానికి ఆ భ‌య‌మే కార‌ణ‌మా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో వరుస విజయాలు సాధిస్తున్నా లుక్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతి సినిమాలో మహేష్ ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నారని చిన్నచిన్న మార్పులు మినహా మహేష్ బాబుక్ లుక్ లో పెద్దగా తేడా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పుష్ప, యానిమల్ లాంటి పాన్ ఇండియా రీచ్ ఉన్న సినిమాలకు మహేష్ బాబు నో చెప్పారు.

కథలు నచ్చినా లుక్ మార్చుకోవాల్సి ఉండటం, వేర్వేరు హెయిర్ స్టైల్స్ లో కనిపించాల్సి ఉండటం వల్లే మహేష్ బాబు ఈ సినిమాలను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. హెయిర్ స్టైల్ ను మార్చడం మహేష్ బాబుకు నచ్చదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మహేష్ బాబు డైరెక్ట్ గా స్పందిస్తే మాత్రమే ఈ సినిమాలను రిజెక్ట్ చేయడం వెనుక అసలు వాస్తవాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది.

మహేష్ బాబు ఈ విధంగా హిట్ సినిమాలను రిజెక్ట్ చేయడం తొలిసారి కాదు. మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాలలో గజిని సినిమా కూడా ఉంది. సూర్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను సైతం మహేష్ బాబు మిస్ చేసుకున్నారు. లీడర్, ఏ మాయ చేశావే, ఇడియట్ సినిమాలు సైతం మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల జాబితాలో అయితే ఉన్నాయి.

ఈ సినిమలలో మహేష్ బాబు నటించి ఉంటే మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరి ఉండేవి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తుండగా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ బాబు రిస్కీ రోల్స్ లో నటిస్తే బాగుంటుందని సేఫ్ జోన్ లో మహేష్ బాబు ఉండటం వల్ల ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఒకింత తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news