Newsచిరంజీవి కథ వినకుండా ఒకే చెప్పాడు... చ‌ర‌ణ్ డిజాస్ట‌ర్ కొట్టాడు....!

చిరంజీవి కథ వినకుండా ఒకే చెప్పాడు… చ‌ర‌ణ్ డిజాస్ట‌ర్ కొట్టాడు….!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ కావాల్సినంత రొమాన్స్, యాక్షన్, ఎమొషన్స్, కామెడీ..ఇలా ప్రతీదీ పుష్కలంగా ఉంటుంది. సీన్ కోసం కొన్ని అద్భుతమైన క్రియేటివ్ థాట్స్ ని కృష్ణవంశీ బాగా ఉపయోగిస్తారు. ఫ్రేం నిండా ఆర్టిస్టులు..స్క్రీన్ నిండా సెట్ ప్రాపర్టీస్ బాగా కనిపిస్తాయి.

సినిమా చూస్తున్నంత సేపు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కృష్ణవంశీ తీసిన నిన్నే పెళ్ళాడతా, ఖడ్గం, మురారి లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఇండస్ట్రీలో కృష్ణవంశీ సినిమాలంటే ఓ ప్రత్యేకత ఉంది. అలాగే, ప్రేక్షకుల్లో కూడా. ఇక హీరోల విషయంలో అయితే, నాగార్జున..చిరంజీవి లాంటి వారు కథ వినకుండా కూడా చేయడానికి రెడీ అవుతారు.

ఇదే గోవిందుడు అందరివాడేలే సినిమా ఫ్లాపవడానికి కారణం అయింది. బండ్ల గణేష్ ఈ సినిమాకి నిర్మాత. పాపం నిండా మునిగిపోయాడు. కృష్ణవంశీ ఫ్లాపుల్లో ఉన్నాడు. ఏ హీరో దొరకడం లేదనే టాక్ వినీస్తుంది. అలాంటి సమయంలో రామ్‌ చరణ్ తో మాట్లాడి గోవిందుడు అందరివాడేలే కథ చెప్పాడు కృష్ణవంశీ. అది చరణ్ కి బాగా నచ్చింది. అదే మాట చిరంజీవితో చెప్పాడు చరణ్.

ఆయన ఒకసారి కృష్ణవంశీని కలవమని చెప్పారు. అలాగే వెళ్లి కలిశాడు కృష్ణవంశీ. చిరు ఒకే మాట చెప్పారు. నువ్వేం చెప్పావో తెలీదు. వాడేమి విన్నాడో తెలీదు. సినిమా మాత్రం బాగా రావాలని చెప్పారు. అలా గోవిందుడు అందరివాడేలే మొదలైంది. రిలీజైయ్యాక ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ అన్నారు. కట్ చేస్తే బండ్ల గణేశ్ కి కోట్లలో నష్టం వచ్చింది. అది భరించలేక కృష్ణవంశీపై ఫైర్ అయ్యాడు కూడా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news