Newsబాలయ్య - ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లు - దిల్ రాజు,...

బాలయ్య – ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లు – దిల్ రాజు, అర‌వింద్ సినిమాలు ఫిక్స్‌… చిరంజీవిని సైడ్ చేసేసారే..!

ప్రస్తుతం బాలకృష్ణకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆయనకు శుక్ర మహర్దశ నడుస్తున్నట్టు ఉంది. టాలీవుడ్ లో పెద్ద పెద్ద బ్యానర్లు, అగ్ర నిర్మాతలు, టాప్ దర్శకులు అందరూ బాలయ్య వెంట పరుగో అంటూ పరుగు పెడుతున్నారు. ఎలాగైనా తమ బ్యానర్‌లో బాలయ్యతో ఒక సినిమా చేయాలని అగ్ర నిర్మాతలు తమ కెరీర్‌లో ఎలాగైనా బాలయ్యతో సినిమా చేసి హిట్టు కొట్టాలని.. స్టార్ డైరెక్టర్లు బాలయ్య డేట్లు కాల్ సీట్ల కోసం ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రయత్నాల్లో కొందరు సక్సెస్ అవుతున్నారు. ఇటు బాలయ్య కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా తన సినిమాలు పట్టాలెక్కించేస్తున్నారు. ఇప్పటికే మైత్రీ వాళ్ళ‌ బ్యానర్ లో వీరసింహారెడ్డి చేసి సక్సెస్ కొట్టిన వెంటనే దసరాకు షైన్ స్క్రీన్ బ్యానర్‌లో భగవంత్‌ కేసరి సినిమాతో మరో హిట్ కొట్టారు. ఇప్పుడు ఏకంగా సితార బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత బాలయ్య‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ అగ్ర‌ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు ప్రయత్నాలు ప్రారంభించేశారు.

దాదాపు ఈ ఇద్దరికీ బాలయ్య, చిరు సినిమా చేయటం ఖరారు అయింది. విచిత్రం ఏంటంటే చిరంజీవి ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక తన బావమరిది అల్లు అరవింద్.. చిరంజీవితో ఒక్క సినిమా చేసేందుకు మొదట్లో ట్రై చేశారు. అయితే ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలు రెండు చిరంజీవి సొంత బ్యానర్ లో చేసుకున్నారు. ఆ తర్వాత బయట బ్యాన‌ర్‌ల‌లో సినిమాలు చేస్తున్నా అరవింద్ కు మాత్రం సినిమా చేయలేదు. మధ్యలో ఏవో తేడాలు వచ్చేయన్న గుసగుసలు బయటకు వచ్చాయి.

అయితే అరవింద్.. బాలయ్యతో అనూహ్యంగా అన్‌స్టాప‌బుల్ ప్రారంభించి సక్సెస్ కొట్టేశాడు. ఇప్పుడు అరవింద్, బాలయ్య బాండింగ్ మామూలుగా లేదు. పైగా బాలయ్యకు బాగా కావాల్సిన బోయపాటి డేట్లు అరవింద్ దగ్గర ఉన్నాయి. ఇటు బాలయ్య కూడా అరవింద్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చేసాడు. సో అరవింద్, బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఫిక్స్ అయిపోవాల్సిందే.

ఇక దిల్ రాజు కూడా బాలయ్యతో ఎప్పటి నుంచే ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి – దిల్ రాజు – బాలయ్య కాంబినేషన్లో సినిమా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. విచిత్రం ఏంటంటే అటు చిరంజీవికి సొంత బావమరిది అయిన అల్లు అరవింద్, ఇటు టాలీవుడ్‌ని త‌న క‌ను సైగ‌ల‌తో శాసించే దిల్ రాజు ఇద్దరు కూడా అస్సలు చిరంజీవిని పట్టించుకోకుండా.. బాలయ్యతో సినిమాలు తీసేందుకు కాంబినేషన్ సెట్ చేసుకుని కాచుకుని ఉండటం బాలయ్య క్రేజ్‌కు నిదర్శనం అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news