News' పుష్ప 2 ' కు సుకుమార్‌కు అన్ని కోట్లా.... వామ్మో...

‘ పుష్ప 2 ‘ కు సుకుమార్‌కు అన్ని కోట్లా…. వామ్మో ఇది మామూలు డిమాండ్ కాదు…!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించి వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప ది రైజ్‌. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఏకంగా బాలీవుడ్ లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లకు పైగా వసూళ్లు పుష్ప సినిమాకు వచ్చాయి. ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 ది రూల్ తెరకెక్కుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. పుష్ప సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ్‌, ఫహద్ ఫాజిల్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ తీసుకుంటున్న రెమ్యున‌రేషన్ టాలీవుడ్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతుంది.

పుష్ప సినిమాతో సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. పైగా ఈ సినిమాలో హీరో బన్నీకి జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు గాను సుకుమార్ డిమాండ్ చేసి మరి రూ.100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో కూడా ఈ రెమ్యూనరేషన్ ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం. ఏది ఏమైనా సుకుమార్ వందకోట్ల దర్శకుడు అయిపోవడం అంటే మామూలు సెన్సేషన్ కాదు. ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news