Newsసిల్వ‌ర్ స్క్రీన్‌పై టైగ‌ర్ టైటిల్స్‌తో వ‌చ్చిన స్టార్ హీరోలు వీళ్లే...!

సిల్వ‌ర్ స్క్రీన్‌పై టైగ‌ర్ టైటిల్స్‌తో వ‌చ్చిన స్టార్ హీరోలు వీళ్లే…!

వెండితెరపై టైగర్ పులి, టైటిల్తో వచ్చిన ఎన్నో సినిమాలు నాటి నుంచి నేటి వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి టైటిల్స్ తో వచ్చిన మన స్టార్ హీరోలు ? ఎవరో.. ఆ సినిమాలో ఏంటో చూద్దాం.
టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు:


దసరా బరిలో టైగర్ నాగేశ్వరరావుగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు రవితేజ. దొంగాట ఫేమ్ వంశీకృష్ణ తెర‌కెక్కించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుంది.
టైగ‌ర్ :
సందీప్ కిషన్ హీరోగా రూపొందిన సినిమా టైగర్ విఐ.ఆనంద్ దర్శకత్వంలో 2015 లో ఈ సినిమా వచ్చింది.
బెంగాల్ టైగ‌ర్‌:
రవితేజ హీరోగా సంపత్ నంది తెర‌కెక్కించిన సినిమా బెంగాల్ టైగర్. ఈ సినిమా కూడా 2015లో రిలీజ్ అయింది.

టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌:


నందమూరి హరికృష్ణ – వి. సముద్ర కాంబినేషన్లో తెర‌కెక్కిన టైగర్ హరిచంద్ర ప్రసాద్ 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
కొమ‌రం పులి:


పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి దర్శకుడు ఎస్‌జె. సూర్య తెర‌కెక్కించిన సినిమా కొమరం పులి. 2010లో రిలీజ్ అయిన‌ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
పులి:
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ – చింబు దేవ‌న్ కాంబినేషన్లో తెరకెక్కిన పులి సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరపరాజయం ఫాలైంది.

టైగ‌ర్ 3 :
బాలీవుడ్ లో విశేష క్రేజ్ ఉన్న ప్రాంచైజీల్లో ఇది ఒకటి. ఏక్తా టైగర్ – టైగర్ జిందా హై తర్వాత తెరకెక్కిన టైగర్ 3 త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది.
టైగ‌ర్ రాముడు!
ఎన్టీఆర్ హీరోగా సిఎస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన టైగర్ రాముడు సినిమా 1962 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది.
టైగ‌ర్‌:


ఎన్టీఆర్ హీరోగా నందమూరి రమేష్ తెర‌కెక్కించిన టైగర్ సినిమా 1979లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా లో తమిళ‌ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించారు.
బొబ్బిలిపులి:
దర్శకుడు దాసరి నారాయణరావు – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన బొబ్బిలి పులి సినిమా 1982లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

బొబ్బిలి:
కృష్ణంరాజు హీరోగా 1980లో దర్శకుడు వి మధుసూదన్ రావు బొబ్బిలి సినిమాను తెరకెక్కించారు.
పులిబిడ్డ‌:
కృష్ణంరాజు పులిబిడ్డ సినిమా 1981లో విడుదలైంది.
బెజ‌వాడ బెబ్బులి:
కృష్ణ హీరోగా విజయనిర్మల దర్శకత్వంలో తనకి ఎక్కిన బెజవాడ బెబ్బులి 1983 లో రిలీజ్ అయింది.
ప‌ల్నాటి పులి:


బాలకృష్ణ హీరోగా తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తరకెక్కిన పల్నాటి పులి సినిమా 1984లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బ్లాక్‌టైగ‌ర్‌:
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు దివంగత ఘట్టమనేని రమేష్ బాబు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్లాక్ టైగర్‌.
పులిబెబ్బులి:


కృష్ణంరాజు – చిరంజీవి కలిసిన నటించిన పులి బెబ్బులి సినిమాకు కెఎస్ఆర్ దాస్ దర్శకుడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news