News' దేవ‌ర ' ఆ యాక్ష‌న్ సీన్ సినిమాకే హైలెట్‌... తార‌క్...

‘ దేవ‌ర ‘ ఆ యాక్ష‌న్ సీన్ సినిమాకే హైలెట్‌… తార‌క్ దుమ్ము లేపేస్తాడ‌ట‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే కొరటాల ఏకంగా ఏడాదిన్నర టైం తీసుకున్నారు అంటే ఈ సినిమా కోసం కొరటాల ఎంత కసితో వర్క్ చేస్తున్నాడో తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

దీంతోపాటు నార్త్ మార్కెట్ కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోతో గెస్ట్ రోల్‌ చేయించే ప్రయత్నాలు కూడా కొరటాల మొదలు పెట్టేశారు. ఇక ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. సినిమాలో ఎక్కువ పార్ట్ సముద్రం నేపథ్యంలోనే జరగనుంది. ఎక్కువగా వీఎఫ్ఎక్స్ విజువల్స్ ఉంటాయట. వచ్చేవారం నుంచి కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.. ఈ సినిమాలో యాక్షన్ మొత్తం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది.

దేవర సినిమాను రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇంటర్వ్యూ తర్వాత వచ్చే ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్ కోసం ఓ భారీ స్విమ్మింగ్ పూల్ సెట్ వేసినట్టు తెలుస్తోంది.

ఈ స్విమ్మింగ్ పూల్ ఫైట్ అదిరిపోతుందని.. తారక్ అయితే దుమ్ము దులిపేసాడని.. ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరమీద చూస్తున్నప్పుడు థియేటర్లలో విజిల్స్ మోత మోగిపోతాయని తెలుస్తోంది. సినిమాకి ఈ సీన్ హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. దేవర సినిమాను రు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో వ‌స్తోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా టాప్ లేపుతోన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news