Newsతారక్ కి ఆ విషయంలో చరణ్ అంటే అస్సలు నచ్చదా..? ఎన్ని...

తారక్ కి ఆ విషయంలో చరణ్ అంటే అస్సలు నచ్చదా..? ఎన్ని సార్లు చెప్పిన మారడా..?

ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ – తారక్ లకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రేంజ్ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . అంతకుముందు చరణ్ గురించి సపరేట్ గా తారక్ గురించి సపరేట్గా వార్తలు ట్రెండ్ అయ్యేటివి. కానీ రీజన్ ఏంటో తెలియదు కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత తారక్ – చరణ్ ఇద్దరికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ మాట్లాడుతూ ..”చరణ్ నాకు దేవుడిచ్చిన బ్రదర్ అని చెప్పుకొస్తూ.. చరణ్ తో రిలేషన్షిప్ ఎప్పుడూ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు”. అంతేకాదు పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ..”చరణ్ లోని ప్లస్ లను చరణ్ లోని మైనస్లను ఓపెన్ గా చెప్పుకొచ్చాడు తారక్ “. ఈ క్రమంలోనే ..”చరణ్ చాలా తెలివిగలవాడని.. ఆయనకు ఆ పని చేయాలనిపిస్తుంది కానీ ఆ పని పక్కవారి చేత చేపిస్తాడు అని .. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు జక్కన్నకు.. ఇక ప్రాక్టీస్ చేయలేకపోతున్నాము అని చెప్పడనికి భయపడ్డాడని.. నా చేత చెప్పించడానికి మాత్రం బాగా ట్రై చేశాడని ..అలాంటి ఓ క్యారెక్టర్ చరణ్ ది అని “చెప్పుకొచ్చాడు.

” అన్ని విషయాలలో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదని.. కొన్ని విషయాలలో బోల్డ్ గా ఉండటమే కరెక్ట్ అని .. చరణ్ అలాంటి బిహేవియర్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అని..చాలా జోవియల్ గా ” చెప్పుకొచ్చాడు. చరణ్ సైఅతం తారక్ చెప్పిన మాటలను నిజం అని ఒప్పుకున్నాడు. దీంతో చరణ్ పద్ధతులు కొన్ని తారక్ కి నచ్చట్లేదు అని పరోక్షంగానే చెప్పేసినట్లయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news